Winter Foods: అసలే చలికాలం.. కొంపదీసి ఇవి తింటున్నారేమో జాగ్రత్తా.!

Winter Foods: అసలే చలికాలం.. కొంపదీసి ఇవి తింటున్నారేమో జాగ్రత్తా.!

Anil kumar poka

|

Updated on: Dec 02, 2024 | 2:02 PM

అసలే ఇది చలికాలం. చలి చాటున సీజనల్‌ వ్యాధులన్నీ మాటు వేసి ఉంటాయి. ఈ నేపథ్యంలో ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఏమి తినాలి? ఏమి తినకూడదు అనే విషయంలో ఓ క్లారిటీకి రావడం ఉత్తమం. ముఖ్యంగా ఆకు కూరల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలంటున్నారు నిపుణులు. ఆకు కూరల్లో ప్రోటీన్లు, ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. వైద్యులు సైతం వీటిని తరచూ తినాలని చెబుతుంటారు.

ఆకుకూరలు ఎంత ఆరోగ్యకరమైనప్పటికీ.. కొన్ని రకాల ఆకుకూరలు శీతాకాలంలో ఆరోగ్యానికి చేటు చేస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కొన్ని రకాల ఆకు కూరలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. చాలా మంది పాలకూరను చాలా మంది ఇష్టంగా తింటుంటారు. అయితే చలికాలంలో ఇది ఆరోగ్య సమస్యలు తెచ్చి పెడుతుందని డైటీషియన్లు చెబుతున్నారు. పాలకూర అనేది మూత్రంలో కాల్షియం విసర్జనను పెంచుతుంది. అందువల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక బచ్చలికూరను చలికాలంలో ఎక్కువగా తింటే జీర్ణాశయానికి సంబంధించిన పలు సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు.

కడుపు ఉబ్బరం, గ్యాస్, తిమ్మిరి వంటి సమస్యల బారిన పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. బచ్చలికూరలో ఉండే ఫైబర్ జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. అందువల్ల అనేక సమస్యలను తెచ్చిపెడుతుంది. సాధారణంగా జీర్ణ సమస్యలు ఉన్నవారు శీతాకాలంలో బచ్చలికూర జోలికి పోవద్దని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా గర్భిణులు, అలెర్జీ సమస్యలు ఉన్నవారు ఈ కాలంలో ఆకుకూరలు తినకపోవడమే ఉత్తమం. ఆకుకూరల్లో ఆక్సలేట్స్ సమ్మేళనం ఉంటుంది. అయితే కీళ్ల నొప్పులు అధికమవ్వడానికి ఈ సమ్మేళనం కారణం అవుతుంది. కాబట్టి కీళ్ల నొప్పులు ఉన్నవారు చలికాలంలో ఆకుకూరలు తినకపోవడమే మంచిది. మరోవైపు అధిక రక్తపోటుతో బాధపడేవారు ఆకుకూరలు తినకపోవడమే మంచిదని వైద్యులు చెబుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.