శ్రీశైలంలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. దేవస్థానం పూజారి ఇంటి ఆవరణలోకి చిరుత రాగా.. ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. పాతాళగంట మెట్ల మార్గంలో నివాసముంటున్న పూజారి సత్యనారాయణ ఇంటి ఆవరణలోకి చిరుత ప్రవేశించింది.