Anil Ravipudi: హీరో ఇమేజ్ కు తగ్గట్టుగా అనిల్ రావిపూడి కథలు
ఈ జనరేషన్‌లో హయ్యస్ట్ సక్సెస్ రేట్ ఉన్న దర్శకుల్లో అనిల్ రావిపూడి కూడా ఒకరు. యాక్షన్ ఎంటర్‌టైన్మెంట్‌ను పర్ఫెక్ట్‌గా బ్లెండ్ చేసే ఈ దర్శకుడు, హీరోల ఇమేజ్‌ను క్యాష్ చేసుకోవటంలో టాప్‌లో ఉన్నారు. ఆల్రెడీ సక్సెస్ అయిన సినిమాలతో పాటు అప్ కమింగ్ సినిమాల విషయంలోనూ హీరోల ఇమేజ్‌కు తగ్గట్టుగా కథలు సిద్ధం చేస్తున్నారు.
Dr. Challa Bhagyalakshmi - ET Head | Edited By: Phani CH
Updated on: Jan 07, 2025 | 9:16 PM

పటాస్, రాజా ది గ్రేట్, ఎఫ్ 2 లాంటి సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న అనిల్ రావిపూడి ఆ సక్సెస్‌లతో స్టార్ లీగ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. అదే జోరులో మహేష్ బాబు హీరోగా సరిలేరు నీకెవ్వరు సినిమాను రూపొందించారు.

మహేష్ ఇమేజ్‌కు తగ్గట్టుగా యాక్షన్ అండ్ ఎంటర్‌టైన్మెంట్‌ను పర్ఫెక్ట్‌గా బ్యాలెన్స్ చేస్తూ రూపొందించిన సరిలేరు నీకెవ్వరు, అనిల్‌ను స్టార్ డైరెక్టర్స్ లిస్ట్‌లో చేర్చింది.

బాలయ్య హీరోగా తెరకెక్కిన భగవంత్ కేసరి విషయంలో డిఫరెంట్ స్టైల్ ఫాలో అయ్యారు అనిల్. తన మార్క్ ఎంటర్‌టైన్మెంట్ చూపిస్తూనే బాలయ్య మాస్ ఇమేజ్‌ను కూడా పర్ఫెక్ట్‌గా యూజ్ చేసుకున్నారు.

అందుకే భగవంత్ కేసరి కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ప్రజెంట్ వెంకీ హీరోగా సంక్రాంతికి వస్తున్నాం అనే ఫ్యామిలీ ఎంటర్‌టైన్మెంట్‌ను రూపొందిస్తున్న అనిల్ రావిపూడి, నెక్ట్స్ మూవీ చిరంజీవి హీరోగా ప్లాన్ చేస్తున్నట్టుగా చెప్పారు.

అంతేకాదు చిరు కోసం రెడీ చేసే కథ గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు రేంజ్‌లో ఉంటుందంటూ ఊరిస్తున్నారు. ఇలా ప్రతీ హీరోకు వాళ్ల ఇమేజ్‌కు తగ్గ కథలు రెడీ చేస్తూ డిఫరెంట్ స్ట్రాటజీతో దూసుకుపోతున్నారు అనిల్ రావిపూడి.





























