- Telugu News Photo Gallery Cinema photos Bollywood Actress Wamiqa gabbi getting crazy offers in Tollywood
Wamiqa Gabbi: తెలుగులో క్రేజీ ఆఫర్స్ అందుకుంటున్న బాలీవుడ్ బ్యూటీ వామిక..
వామికా గబ్బి 1993 సెప్టెంబరు 29న చండీగఢ్‌లోని పంజాబీ కుటుంబంలో జన్మించింది. ఆమె తండ్రి గోవర్ధన్ గబ్బి హిందీ, పంజాబీ భాషలలో కవి, రచయిత. అతని కలం పేరు గబ్బి. ఆమె తల్లి రాజ్‌కుమారి టీచర్. ఈ చిన్నది బాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఇటీవలే బేబీ జాన్ సినిమాలో నటించింది. ప్రస్తుతం తెలుగులో అవకాశాలు అందుకుంటుంది.
Updated on: Jan 07, 2025 | 8:22 PM

వామికా గబ్బి ఈ చిన్నదాని పేరు ఇప్పుడు ఇండస్ట్రీలో తెగ వినిపిస్తుంది. ఈ చిన్నది తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే.. సుధీర్ బాబు హీరోగా నటించిన భలే మంచి రోజు సినిమాలో నటించింది ఈ అమ్మడు.

కానీ ఈ సినిమా అంతగా హిట్ కాకపోవడంతో ఈ బ్యూటీకి సరైన క్రేజ్ రాలేదు. ఆ తర్వాత హిందీలోనే వరుస ఆఫర్స్ అందుకుంది.భలే మంచి రోజు సినిమాలో బొద్దుగా కనిపించిన ఈ అమ్మడు ఇప్పుడు షాకింగ్ లుక్ లోకి మారిపోయింది.

అంతే కాదు తన అందాలతో కుర్రకారుకు కిర్రెక్కిస్తుంది ఈ అమ్మడు. ఈ ముద్దుగుమ్మ పంజాబీ, హిందీ సినిమాలతో పాటు తెలుగు, మలయాళ సినిమాల్లోనూ నటించింది. ఇక రీసెంట్ గా వరుణ్ ధావన్ ,కీర్తిసురేష్ జంటగా నటించిన బేబీ జాన్ సినిమాలో నటించింది.

ఈ మూవీలో ఆమె సెకండ్ హీరోయిన్ గా చేసింది. ఇక ఇప్పుడు ఈ చిన్నది తెలుగులోనూ ఆఫర్స్ అందుకుంటుంది. అడవి శేష్ నటిస్తున్న గూఢచారి 2 సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. తాజాగా ఈ సినిమా పోస్టర్ ను రిలీజ్ చేశారు.

ఇక వామిక ఇప్పుడు తెలుగులోనూ బిజీ హీరోయిన్ గా మారనుందని తెలుస్తుంది. అందాలతో పాటు నటనతోను ఆకట్టుకుంటున్న ఈ అమ్మడు. తెలుగులో మరిన్ని అవకాశాలు అందుకుంటుందని తెలుస్తుంది. నెట్టింట క్రేజీ ఫోటోలు షేర్ చేస్తుంది ఈ అమ్మడు.





























