Vishal: విశాల్‌కు ఏమైంది.. అలా అయిపోయాడేంటి
హీరో విశాల్‌కు ఏమైంది..? ఆయనేకైంది బాగానే ఉన్నాడు కదా.. పైగా యాక్షన్ హీరో.. ఇప్పటికీ ఫైట్లు గట్రా బాగానే చేస్తుంటాడు కదా అనుకుంటున్నారేమో..? కానీ ఇప్పుడు విశాల్‌ను చూస్తే షాక్ అవ్వడం కాదు.. అంతకుమించి అవుతారు. అసలింతకీ విశాల్‌కు ఏమైంది..? ఆయనెందుకు కనీసం నిలబడలేకపోతున్నారు..?
Updated on: Jan 07, 2025 | 7:51 PM

విశాల్ అంటే మనకు ఇలా ఎనర్జిటిక్‌గా ఉండటమే గుర్తుకొస్తుంది. కొన్నేళ్ల నుంచి కూడా విశాల్ కేరాఫ్ మాస్ యాక్షన్ సినిమాలే. పైగా ఫైర్ బ్రాండ్ కూడా.. సినిమాల్లోనే కాదు బయట కూడా అదే ఎనర్జీతో కనిపిస్తుంటారు ఈ హీరో.

కానీ ఈయన ఇప్పుడెలా ఉన్నారో తెలుసా..? చెప్పడం ఎందుకు ఓ సారి మీరే చూసేయండి.. చూస్తున్నారుగా.. విశాల్ ఇప్పుడెలా ఉన్నారో..? నెల రోజుల కింది వరకు కూడా చాలా ఎనర్జీతో కనిపించిన ఈయన సడన్‌గా కనీసం నిలబడలేనంత వీక్ అయిపోయారు.

అసలెందుకు విశాల్ ఇలా అయిపోయారనేది ఫ్యాన్స్‌కు కూడా అర్థం కావట్లేదు. అసలేమైంది మా హీరోకు అంటూ అంతా ఆశ్చర్యపోవడం తప్ప ఎవరికీ సమాధానం దొరకట్లేదు. కొన్ని రోజులుగా మీడియాకు దూరంగా ఉన్నారు విశాల్. తాజాగా మధగజరాజా ఆడియో లాంఛ్‌కు వచ్చారు విశాల్.

ఇది 12 ఏళ్ళ కింది సినిమా. సుందర్ సి తెరకెక్కించిన మదగజరాజా 2013లోనే విడుదల కావాల్సి ఉంది. కానీ అనుకోని కారణాలతో పుష్కర కాలంగా వాయిదా పడుతున్న ఈ చిత్రం.. ఎట్టకేలకు జనవరి 12న విడుదల కాబోతుంది. విశాల్‌కు జోడీగా ఇందులో అంజలి, వరలక్ష్మి శరత్ కుమార్ నటించారు. ఈ సినిమా ఆడియో లాంఛ్‌లో విశాల్‌ను చూసి అంతా షాక్ అయ్యారు.

వణుకుతూ మాట్లాడటమే కాదు.. కనీసం నిలబడేందుకు కూడా శక్తి కనబడలేదు ఆ మనిషిలో. అయితే హై ఫీవర్ కారణంగానే ఇలా ఉన్నారంటూ వార్తలొస్తున్నా.. అసలు విషయం మాత్రం అది కాదని అర్థమవుతుంది.




