- Telugu News Photo Gallery Cinema photos Meenakshi Chaudhary Revels she went into depression for a week After Vijay Thalapathy GOAT Movie
Tollywood: స్టార్ హీరోతో సినిమా.. ట్రోల్స్ తట్టుకోలేక డిప్రెషన్లోకి వెళ్లిన హీరోయిన్..
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమె మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. కానీ ఒకానొక సమయంలో తన సినిమా గురించి ట్రోల్స్ రావడంతో డిప్రెషన్ లోకి వెళ్లిపోయిందట. సోషల్ మీడియాలో తన గురించి వచ్చిన ట్రోల్స్, కామెంట్స్ చూసి ఎంతో బాధపడినట్లు చెప్పుకొచ్చింది. ఇంతకీ ఆమె ఎవరంటే..
Updated on: Jan 08, 2025 | 12:00 PM

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లలో మీనాక్షి చౌదరి ఒకరు. గతేడాది లక్కీ భాస్కర్ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం సంక్రాంతికి వస్తున్నాం మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉంది మీనాక్షి. జనవరి 14న ఈ సినిమా విడుదల కానుంది.

డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో హీరోగా వెంకటేశ్ నటిస్తున్న సినిమా సంక్రాంతికి వస్తున్నాం. ఇందులో ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ ఆకట్టుకున్నాయి.

ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మీనాక్షి ఆసక్తికర విషయాలను పంచుకుంది. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి హీరోగా నటించిన గోట్ చిత్రంలో కథానాయికగా కనిపించింది మీనాక్షి.

ఈ సినిమా తర్వాత తనపై సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్స్ చేశారని.. ఆ వీడియోస్ చూసి తాను ఎంతో బాధపడినట్లు చెప్పుకొచ్చింది. ఆ ట్రోల్స్ వల్ల దాదాపు వారం రోజులు డిప్రెషన్ లోకి వెళ్లానని తెలిపింది.

ఆ తర్వాత లక్కీ భాస్కర్ సినిమా విడుదల గొప్ప విజయాన్ని అందుకుందని.. అందులో తన నటనకు ప్రశంసలు లభించాయని.. కథల ఎంపికలో మార్పులు చేయాలని అప్పుడే నిర్ణయించుకున్నట్లు చెప్పుకొచ్చింది.




