ఓర్నీ.. గర్ల్‌ ఫ్రెండ్‌ కోసం ఎంత పని చేశాడు.. చివరికి

ఓర్నీ.. గర్ల్‌ ఫ్రెండ్‌ కోసం ఎంత పని చేశాడు.. చివరికి

Phani CH

|

Updated on: Jan 07, 2025 | 12:59 PM

సాధారణంగా ప్రేమలో ఉన్న వారు తమ గర్ల్‌ ఫ్రెండ్‌ను మెప్పించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అమ్మాయిలను సినిమాలకు తీసుకెళ్లడం, వారికి నచ్చిన గిఫ్ట్స్‌ కొనివ్వడం చేస్తుంటారు. కానీ ఓ వ్యక్తి తన గర్ల్ ఫ్రెండ్‌ ముందు తన హీరోయిజాన్ని ప్రదర్శించబోయి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. ఏకంగా సింహాల బోనులోకి వెళ్లి దురదృష్టవశాత్తు వాటికి ఆహారమైపోయాడు.

అధికారులు చెప్పినదానిని బట్టి చూస్తే.. ఉజ్బెకిస్థాన్‌ పార్కెంట్‌లోని ఓ ప్రైవేట్‌ జూలో ఎఫ్‌.ఇరిస్కులోవ్‌ అనే వ్యక్తి జూ కీపర్‌గా పని చేస్తున్నారు. ఒకరోజు రాత్రి విధుల్లో ఉండగా.. గర్ల్‌ఫ్రెండ్‌కు కాల్‌ చేశాడు. ఆ క్రమంలో ఆమెను మెప్పించడానికి వీడియో తీస్తూ మూడు సింహాలు ఉన్న ఎన్‌క్లోజర్‌లోకి ప్రవేశించాడు. పడుకున్న సింహాలు అతడిని ఏమీ చేయలేదు. అంతటితో అతను సైలెంట్‌గా బయటకు రాకుండా ఓ సింహాన్ని.. సింబా.. నిశ్శబ్దంగా ఉండూ అంటూ దానితో మాటలు కలిపాడు. అంతే మనిషి గొంతు వినగానే పక్కనేఉన్న మిగతా సింహాలు ఒక్క ఉదుటన లేచాయి. అతనిపై ఒక్కసారిగా దాడిచేసాయి. దీంతో ఇరిస్కులోవ్‌ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన డిసెంబరు 17న జరిగినట్లు పోలీసులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇరిస్కులోవ్‌ను హతమార్చిన అనంతరం మూడు సింహాలు బోనులో నుంచి బయటకు వచ్చి జూ ప్రాంగణంలో తిరిగాయని వెల్లడించారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Madhavi Latha: మాట్లాడుతూ బోరున ఏడ్చేసిన మాధవీలత

తెలంగాణలోనూ ‘గేమ్ ఛేంజర్’ టికెట్ రేట్ల పెంపుపై దిల్ రాజు షాకింగ్ కామెంట్స్

డాక్టర్ to యాక్టర్.. ఈ బ్యూటీ జర్నీ మామూలుగా లేదుగా..

Pawan Kalyan: చరణ్ అభిమానులు మృతి.. కుటుంబాలకు పవన్ భరోసా

Ram Charan: అభిమానుల మృతిపై చరణ్ ఎమోషనల్