చనిపోయాడని అంత్యక్రియలకు సిద్ధం.. తీరా చూస్తే..!
చనిపోయాడని భావించి అంత్యక్రియలు చేస్తుండగా..ఒక్కసారిగా పైకి లేస్తే ఎలా ఉంటుంది..? గుండెలు అదిరిపోతాయ్ కదూ. ఇలాంటి ఘటనలు గతంలో కొన్ని సందర్భాల్లో చూశాం. వైద్యానికి స్పందించకపోతే చనిపోయారని కొంత మంది వైద్యులు తొందరపడి డిక్లేర్ చేస్తుంటారు. ఇప్పుడలాంటి ఘటనే జరిగింది. గుండెపోటుకు గురైన ఓ వృద్ధుడికి సీపీఆర్ చేసినా చలనం లేకపోయేసరికి చనిపోయినట్లు తేల్చారు. డాక్టర్లు చెప్పాక తిరుగుంటుందా అనుకుని అంత్యక్రియలు నిర్వహించేందుకు అంబులెన్స్ లో ఇంటికి తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు కుటుంబ సభ్యులు.
కానీ ఈ దారి మధ్యలోనే ఎవరూ ఊహించని రీతిలో లేచి కూర్చున్నాడు ఆ వృద్ధుడు. అసలు ఈ స్టోరీ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.మహారాష్ట్రలోని కొల్హాపూర్‌కు చెందిన పాండురంగ్‌కి 65 ఏళ్లు. ఆరోగ్యంగానే ఉండేవాడు. కానీ డిసెంబర్ 16వ తేదీన అనుకోకుండా గుండెపోటుకు గురై ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. విషయం గుర్తించిన కుటుంబ సభ్యులు వెంటనే అతడిని అంబులెన్స్ ద్వారా స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడే వైద్యులు పాండురంగ్‌కు సీపీఆర్ చేశారు. అయినా అతడిలో చలనం లేకపోయే సరికి వైద్యులు పాండురంగ్ చనిపోయినట్లు నిర్ధారించారు. దీంతో కుటుంబ సభ్యులు అంతా కన్నీళ్లు పెట్టుకుంటూ.. అంత్యక్రియలు ఏర్పాట్లు చేయమని గ్రామస్థులు, బంధువులకు చెప్పారు. కుటుంబ సభ్యులు అతడిని ఇంటికి తీసుకెళ్తుండగా…మార్గమధ్యంలో అంబులెన్స్ డ్రైవర్.. స్పీడ్ బ్రేకర్ చూస్కోలేదు. అలా వాహనం ఒక్కసారిగా కుదుపునకు గురైంది. దీంతో చనిపోయాడనుకున్న వృద్ధుడిలో చలనం మొదలైంది.