సమోసాను నిషేధించిన ఆ దేశం.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
భారత దేశ ప్రజలు సాధారణంగా భోజన ప్రియులు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో వంటకు ప్రత్యేకత ఉంటుంది. అయితే దేశవ్యాప్తంగా ఉపయోగించే మసాలా దినుసులు మాత్రం ఒక్కటే. ఎందుకంటే మనం ఉపయోగించే మసాలా దినుసుల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. అనేక వ్యాధుల నివారణకు మసాలా దినుసులు ఉపయోగిస్తారు. అందుకే భారతీయ వంటకాలు రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అందిస్తాయి. అయితే ఇక్కడ మనం ఔషధంగా ఉపయోగించే కొన్ని పదార్థాలను కొన్ని దేశాల్లో నిషేధిస్తారు. ఎందుకు? అవి ఏంటో తెలుసుకుందాం.
విదేశాల్లో నిషేధించే వంటకాల్లో మన సమోసా ఒకటి. త్రికోణాకారంలో ఉండే ఈ సమోసాను సోమాలియా దేశంలో నిషేధించారు. అందుకు వారు చెప్పే కారణం చాలా విచిత్రంగా అనిపిస్తుంది. సోమాలియాలో ఎక్కువగా క్రైస్తవాన్ని ఆరాధిస్తారు. అందులో అల్ షబాబ్ క్రిస్టియానిటీ గ్రూపునకు చెందిన చిహ్నాన్ని కించపర్చేలా సమోసా ఆకృతి ఉందంటూ ఆ దేశంలో ముక్కోణపు ఆకారపు సమోసాలపై నిషేధం విధించారు.మన దేశీయులే కాదు విదేశీయులు సైతం ఎంతో ఇష్టంగా తినే కబాబ్‌ను ఇటలీ నిషేధించింది. ఇటలీలోని వెనీస్ నగరం ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ప్రదేశం. కానీ మన దేశంలో ఫేమస్ అయిన కబాబ్ లను 2017 నుంచి వెనీస్ లో నిషేధించారు. అందుకు కారణం ఆ నగర సంప్రదాయాలకు, అభిరుచులకు కబాబ్ విరుద్ధమట.
వైరల్ వీడియోలు
Latest Videos