కోళ్లకు అందాల పోటీలు.. వీటి రేటు ఎంతో తెలుసా ??

కోళ్లకు అందాల పోటీలు.. వీటి రేటు ఎంతో తెలుసా ??

Phani CH

|

Updated on: Jan 06, 2025 | 5:27 PM

మీరు సాధారణంగా ఎన్నో రకాల అందాల పోటీలు చూసే ఉంటారు. కోళ్లకు కూడా అందాల పోటీలు ఉన్నాయన్న సంగతి మీకు తెలుసా..? ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్నాటక రాష్ట్రాల్లో కోళ్లకు అందాల పోటీలు నిర్వహిస్తున్నారు. వాటిలో ఉత్తమమైన కోళ్లకు ప్రశంసా పత్రాలతో పాటు బహుమతులు అందజేస్తున్నారు. వీటి కోసం ఆ కోళ్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు.

వారెవ్వా ఏమి నోసు.. అచ్చు హీరోయిన్‌లా ఉంది బాసూ..! అంటూ వాటిని చూసి జనం తెగ సంబరపడిపోతారు. అందాల పోటీలు నిర్వహించి మరీ ఆ సొగసిరులకు కానుకలు అందిస్తారు. వీటిలో అత్యంత అందంగా, మేలు జాతికి చెందినవైతే ఒక్కొక్కటి రూ. 1.20 లక్షల ధర పలుకుతోందట. ప్రకాశం జిల్లా కొమరోలు మండలం రాజుపాలెం గ్రామానికి చెందిన సయ్యద్ బాషా అందాల పోటీలకు కోళ్లను సిద్ధం చేస్తున్నారు. దాదాపు పాతిక సంవత్సరాల నుంచి చిలక ముక్కు పర్ల కోళ్ల జాతికి చెందిన కోళ్ళను పెంచుతూ వాటిని అందాల పోటీలకు తీసుకెళ్తున్నారు. తన తండ్రి వృత్తిని వారసత్వంగా తీసుకున్న సయ్యద్ బాషా కోళ్లపై మక్కువ పెంచుకున్నాడు. రకరకాల జాతులను పెంచుతూ చివరకు దేశంలోనే అరుదైన జాతిలో ఒకటైన పర్లా కోళ్ళు అంటే చిలకమ్మ కోళ్లను పెంచుతూ ఈ వృత్తిని ఉపాధిగా మార్చుకున్నట్లు చెబుతున్నారు. ఈ కోడి కి సంబంధించిన గుడ్డు ధరే 1,000 రూపాయలు పలుకుతుందంటే మీరే అర్థం చేసుకోవచ్చు ఈ కోడికి ఎందుకింత డిమాండో తెలుసా..! నెమలిని కోడిని క్రాస్ చేయించడం, జన్యు మార్పిడి వల్ల ఈ కోళ్లు పుడతాయని సయ్యద్ బాషా అంటున్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రైల్వే ట్రాక్ పై పబ్జీ ఆడారు.. సడన్ గా రైలు రావడంతో..

పాము కాటుకు దివ్య ఔషధం !! కేవలం 5 నిమిషాల్లోనే..

ఛీ.. తిని వదిలేసిన ఆహారంతో నూనె తయారీ.. తిరిగి దానితోనే వంటలు

ఇదెక్కడి బాదుడురా నాయనా !! సంక్రాంతికి టిక్కెట్ రేట్లు ఎంతో తెలుసా ??

Game Changer: గేమ్‌ ఛేంజర్ ఈవెంట్‌కు కియారా డుమ్మా.. ఎందుకంటే ??