ఇదెక్కడి బాదుడురా నాయనా !! సంక్రాంతికి టిక్కెట్ రేట్లు ఎంతో తెలుసా ??

ఇదెక్కడి బాదుడురా నాయనా !! సంక్రాంతికి టిక్కెట్ రేట్లు ఎంతో తెలుసా ??

Phani CH

|

Updated on: Jan 06, 2025 | 5:18 PM

మరికొన్ని రోజుల్లో సంక్రాంతి పండుగ వచ్చేస్తోంది. ఈ క్రమంలో నగరాలనుంచి ప్రజలంతా పల్లెబాట పడతారు. ఇంటిల్లపాదీ తమ సొంతూళ్లకు ప్రయాణమవుతారు. అందుకు ముందే రైలు టికెట్లు, బస్సు టికెట్లు కోసం రిజర్వేషన్‌ చేసుకుంటారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు సంక్రాంతి అంటే చాలా ప్రత్యేకమైనది. దాంతో దేశం నలుమూలలనుంచి తెలుగువారు పెద్ద సంఖ్యలో సొంతూళ్లకు పయనమవుతున్నారు.

అయితే ప్రయాణానికి మాత్రం భారీ ‘వ్యయ’ప్రయాసలు తప్పడం లేదు. రైళ్లలో ఇప్పటికే రిజర్వేషన్లు అయిపోగా.. ఆర్టీసీ బస్సుల్లోనూ దాదాపు టికెట్లు దొరకని పరిస్థితి ఉంది. విమాన టికెట్ల ధరలకూ రెక్కలొచ్చాయి. దీంతో పలు ప్రైవేటు బస్సుల యజమానులు అడ్డగోలు దోపిడీకి తెరతీస్తున్నారు. పండక్కి ఎలాగైనా సొంతూళ్లకు వెళ్లాలన్న ప్రజల ఆసక్తిని క్యాష్‌ చేసుకుంటున్నారు. అడ్డగోలుగా ఛార్జీలు పెంచేస్తున్నారు. ప్రైవేటు స్లీపర్‌ ఏసీ బస్సుల్లో హైదరాబాద్‌ నుంచి విశాఖపట్నానికి గరిష్ఠంగా రూ.7వేలకు పైగా వసూలు చేస్తున్నారు. ఆదిలాబాద్‌కు రూ.2,300.. మంచిర్యాలకు రూ.3,500 తీసుకుంటున్నారు. జనవరి 9 నుంచి 12 వరకు రైళ్లు, బస్సులు, విమాన టికెట్లకు డిమాండ్‌ అధికంగా ఉంది. సంక్రాంతి పండగ దగ్గరపడే కొద్దీ ప్రైవేటు బస్సుల్లో టికెట్ల ధరలు భగ్గుమంటున్నాయి. దూరప్రాంతాలకు వెళ్లేవారు స్లీపర్‌ బస్సులకు ప్రాధాన్యమిస్తారు. దీంతో లోయర్‌ బెర్తులకు.. కొన్ని బస్సుల్లో ముందువరుస సీట్లకు అదనంగా వసూలు చేస్తున్నారు. టికెట్‌ ఛార్జీలపై జీఎస్టీ కూడా వసూలు చేస్తున్నారు. జనవరి 12న హైదరాబాద్‌ నుంచి విశాఖకు ఓ ప్రైవేటు ఏసీ స్లీపర్‌ బస్సులో టికెట్‌ ధర రూ.6,999, జీఎస్టీ రూ.349.95 కలిపి మొత్తం రూ.7,348.95 వసూలు చేస్తున్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Game Changer: గేమ్‌ ఛేంజర్ ఈవెంట్‌కు కియారా డుమ్మా.. ఎందుకంటే ??

Game Changer: గేమ్‌ ఛేంజర్ టీమ్‌కి చంద్రబాబు, పవన్‌ సర్‌ప్రైజ్ గిఫ్ట్

Ratan Tata Statue: ఉండిలో రతన్‌ టాటా కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి లోకేశ్