ఛీ.. తిని వదిలేసిన ఆహారంతో నూనె తయారీ.. తిరిగి దానితోనే వంటలు

ఛీ.. తిని వదిలేసిన ఆహారంతో నూనె తయారీ.. తిరిగి దానితోనే వంటలు

Phani CH

|

Updated on: Jan 06, 2025 | 5:20 PM

వీకెండ్‌లో ఫ్యామిలీతో కలిసి సరదాగా రెస్టారెంట్లకు వెళ్లి ఇష్టమైన రుచికరమైన భోజనం చేస్తుంటాం. అప్పటివరకూ ఇంటి భోజనంతో బోరు కొట్టడంతో రెస్టారెంట్‌లో వేడి వేడిగా వడ్డించే ఆహారం బహురుచిగా అనిపిస్తుంది. అయితే ఆ ఆహారానికి అంతటి రుచి ఎలా వస్తుందో తెలిస్తే షాకవుతారు. రెస్టారెంట్‌లో మిగిలిపోయిన ఆహార పదార్థాలను సేకరించి, ఆపై వాటితో నూనె తయారు చేసి, దానిని రెగ్యులర్‌గా వాడే కొత్త నూనెలో కలిపేసి తిరిగి వంటలకు వాడుతున్నారట.

ఇది తెలిస్తే ఆశ్చర్యంతోపాటు అసహ్యం కూడా వేస్తుంది కదా. కానీ ఇది నిజం.. చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లో ఓ ప్రముఖ రెస్టారెంట్‌లో వెలుగుచూసిన ఈ విషయం విస్తుగొలుపుతోంది. వినియోగదారులు మిగిల్చిన చిల్లీ ఆయిల్ సూప్స్, ఇతర ఆహార పదార్థాలను రీసైక్లింగ్ చేస్తున్న రెస్టారెంట్.. దాని నుంచి నూనె సేకరించి సూప్‌లో కలిపి వడ్డిస్తోంది. ఓ కస్టమర్ ఈ విషయాన్ని గమనించి ఫుడ్ సేఫ్టీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో విషయం బయటకు వచ్చింది. దీనిని సలైవా ఆయిల్‌గా పేర్కొంటున్నారు. కస్టమర్లు వదిలేసిన ఆహార పదార్థాల నుంచి నూనె సేకరిస్తున్న విషయం నిజమేనని రెస్టారెంట్ యజమాని అంగీకరించాడు. గతేడాది సెప్టెంబర్ నుంచి ఇలా చేస్తున్నామని, కొత్త ఆయిల్‌తో కలిపి వంటలు చేస్తున్నట్టు చెప్పాడు. వ్యాపారం తగ్గడంతో వంటకాల రుచి పెంచేందుకే ఇలా చేస్తున్నట్టు తెలిపాడు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇదెక్కడి బాదుడురా నాయనా !! సంక్రాంతికి టిక్కెట్ రేట్లు ఎంతో తెలుసా ??

Game Changer: గేమ్‌ ఛేంజర్ ఈవెంట్‌కు కియారా డుమ్మా.. ఎందుకంటే ??

Game Changer: గేమ్‌ ఛేంజర్ టీమ్‌కి చంద్రబాబు, పవన్‌ సర్‌ప్రైజ్ గిఫ్ట్

Ratan Tata Statue: ఉండిలో రతన్‌ టాటా కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి లోకేశ్