Srisailam: ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు.. అర్ధరాత్రి పూజారి ఇంట్లోకి చొరబడిన చిరుత.. ఆ తర్వాత

Srisailam: ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు.. అర్ధరాత్రి పూజారి ఇంట్లోకి చొరబడిన చిరుత.. ఆ తర్వాత

J Y Nagi Reddy

| Edited By: Ram Naramaneni

Updated on: Jan 06, 2025 | 12:23 PM

పుణ్యక్షేత్రాలను వన్యమృగాలు వీడటంలేదు. కొంతకాలంగా ఏ పుణ్యక్షేత్రాన్నీ అడవి జంతువులు వదలడం లేదు. ఇటీవల తిరుమలలో పులులు, పాములు భక్తులను కంగారు పెట్టించాయి. ఇప్పుడు మరోసారి శ్రీశైలంలో చిరుతపులి సంచారం కలకలం సృష్టించింది. నిత్యం ఈ పుణ్యక్షేత్రం పరిసర ప్రాంతాల్లో ఎక్కడో అక్కడ సంచరిస్తూ చిరుతలు స్థానికులను, భక్తులను భయాందోళనకు గురిచేస్తూనే ఉన్నాయి..

నంద్యాల జిల్లా శ్రీశైలంలో పాతాళ గంగ మెట్ల మార్గంలో పూజారి సత్యనారాయణ ఇంటి ఆవరణలోకి అర్ధరాత్రి చిరుత పులి చొరబడింది. ఆ ఇంటి పరిసరాల్లో ఆహారం కోసం వెతుకుతూ ఎలాంటి ఆహారం దొరక్కపోవడంతో చిరుత నెమ్మదిగా అక్కడినుంచి వెళ్లిపోయింది. చిరుత పులి దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఉదయం సీసీ పుటేజీ చూసి వారు షాక్ గురయ్యారు. గత కొన్ని నెలలుగా శ్రీశైలం పరిసర ప్రాంతాల్లో నిత్యం చిరుత పులి సంచారం కలకలం రేపుతుంది. దీంతో రాత్రుళ్లు బయటకు రావాలంటే స్థానికులు భయపడుతున్నారు. ఈ క్రమంలో దేవస్థానం అధికారులు, అటవీశాఖ అధికారులు స్థానికులు, భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి