తెలంగాణలోనూ ‘గేమ్ ఛేంజర్’ టికెట్ రేట్ల పెంపుపై దిల్ రాజు షాకింగ్ కామెంట్స్
సంక్రాంతికి రిలీజయ్యే అన్ని సినిమాల టికెట్ ధరలు పెంచుకోవడానికి ఏపీ ప్రభుత్వం అనుమతులిచ్చింది. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, బాలయ్య డాకు మహారాజ్ తో పాటు వెంకటేశ్ సంక్రాంతికి వస్తున్నాం సినిమా టికెట్ల ధరల పెంచుకోవడానికి ఏపీ ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది. అయితే తెలంగాణలో ఈ విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు.
తాజాగా ఈ విషయంపై కీలక వ్యాఖ్యలు చేశారు టీఎఫ్‌డీసీ ఛైర్మన్, దిల్ రాజు. ఏపీలో లాగే తెలంగాణలోనూ సినిమా టికెట్ రేట్ల పెంపుపై సీఎం రేవంత్ రెడ్డితో చర్చిస్తానన్నారు దిల్ రాజు. గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అద్భుతమైన ఈవెంట్. దీనికోసం టైం స్పెండ్ చేసి వచ్చిన పవన్ కళ్యాణ్ కు ధన్యవాదాలు. ఏపీ లో టికెట్ రేట్స్ పెంచినందుకు ఏపీ సీఎం డిప్యూటీ సీఎం, సినిమాటోగ్రఫీ మినిస్టర్ కు ధన్యవాదాలు అని చెప్పిన దిల్ రాజు.. ప్రొడ్యూసర్‌గా .. తెలంగాణలో కూడా టికెట్ రేట్లు పెంచమని సీఎం రేవంత్ రెడ్డిని అడుగుతానన్నారు. తన సినిమాలు చూసి సంక్రాంతికి దిల్ రాజు కం బ్యాక్ అని జనాలు అంటారని ఆశాభావం వ్యక్తం చేశారు దిల్ రాజ్. గేమ్ ఛేంజర్ టికెట్ రేట్స్‌పై తెలంగాణ సీఎం రేవంత్ ను కూడా అడుగుతానన్నారు. ఫైనల్ డెసీషన్ ఆయనదే అంటూ క్లారిటీ ఇచ్చారు. సినిమా ఇండస్ట్రీ అభివృద్ధికి ఆయన కూడా ముందు చూపుతో ఉన్నారని..కాబట్టి నిర్మాతగా టికెట్ రేట్ల పెంపు కోసం తన వంతు ప్రయత్నం చేస్తానని దిల్ రాజు చెప్పారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
డాక్టర్ to యాక్టర్.. ఈ బ్యూటీ జర్నీ మామూలుగా లేదుగా..
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

