Pawan Kalyan: చరణ్ అభిమానులు మృతి.. కుటుంబాలకు పవన్ భరోసా
ప్రమాదంలో రామ్ చరణ్ అభిమానులు మృతి చెందడంపై ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పందించారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కాకినాడ – రాజమహేంద్రవరం నగరాల మధ్య ఉన్న ఏడీబీ రోడ్డు ఛిద్రమైపోయింది. గత అయిదేళ్ళల్లో ఈ రోడ్డు గురించి పట్టించుకోలేదు. పాడైపోయిన ఈ రోడ్డును బాగుచేస్తున్నారు.
ఈ దశలో ఏడీబీ రోడ్డుపై చోటు చేసుకున్న ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారని తెలిసి ఆవేదనకు లోనయ్యానంటూ ట్వీట్ లో రాసుకొచ్చారు పవన్. కాకినాడ జిల్లా గైగోలుపాడుకు చెందిన ఆరవ మణికంఠ, తోకాడ చరణ్ శనివారం రాత్రి ద్విచక్రవాహనంపై ఇళ్లకు వెళుతున్న క్రమంలో…ఆ యువకులను వేగంగా వస్తున్న వాహనం ఢీ కొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరూ మృతి చెందారు. మణికంఠ, చరణ్ కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నానంటూ ట్వీట్లో మెన్షన్ చేశారు పవన్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వైరల్ వీడియోలు
Latest Videos