Ram Charan: అభిమానుల మృతిపై చరణ్ ఎమోషనల్
గేమ్ ఛేంజర్ ... గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ రెండు రోజుల క్రితం రాజమండ్రిలో జరిగింది. ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా విచ్చేసిన ఈ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. అయితే ఈ వేడుక అనంతరం తిరిగు ప్రయాణంలో అనుకోని ఘటన జరిగింది.
కాకినాడ జిల్లా గైగోలుపాడుకు చెందిన ఆరవ మణికంఠ, తోకాడ చరణ్ తిరుగు ప్రయాణంలో బైకు పై ఇంటికి వెళుతూ.. ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలోనే తన అభిమానుల మృతిని తెలుసుకుని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎమోషనల్ అయ్యారు. వారి కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటించారు. ఇప్పటికే గేమ్ ఛేంజర్ మూవీ ప్రొడ్యూసర్ దిల్ రాజు..ఈ ఇద్దరి మృతి గురించి తెలుసుకుని.. వారి కుంటుంబాలకు అండగా ఉంటామంటూ భరోసా ఇచ్చారు. ఇరు కుంటుంబాలకు చెరో 5 లక్షల రూపాయలను ఆర్థిక సాయంగా ప్రకటించారు. ఇప్పుడు రామ్ చరణ్ కూడా… తన అభిమానుల కుటుంబాలను ఆదుకోడానికి ముందుకొచ్చారు. ఇద్దరు అభిమానుల మృతిపై రామ్ చరణ్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశాడు. ఘటన గురించి తెలిసిన వెంటనే ఆ ఇద్దరు అభిమానుల ఇంటికి తన సన్నిహితులను పంపించి భరోసా ఇచ్చాడు. కుటుంబాలకు చెరొక ఐదు లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TTD: 2024లో రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం
కోళ్లకు అందాల పోటీలు.. వీటి రేటు ఎంతో తెలుసా ??
రైల్వే ట్రాక్ పై పబ్జీ ఆడారు.. సడన్ గా రైలు రావడంతో..
పాము కాటుకు దివ్య ఔషధం !! కేవలం 5 నిమిషాల్లోనే..
ఛీ.. తిని వదిలేసిన ఆహారంతో నూనె తయారీ.. తిరిగి దానితోనే వంటలు