TTD: 2024లో రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం

TTD: 2024లో రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం

Phani CH

|

Updated on: Jan 06, 2025 | 5:54 PM

నూతన సంవత్సరం నేపథ్యంలో గతేడాది తిరుమల శ్రీవారి హుండీ లెక్కలను టీటీడీ వెల్లడించింది. 2024లో హుండీ ద్వారా వెంకన్నకు 1,365 కోట్ల ఆదాయం వచ్చినట్లు తెలిపింది. ఈ లెక్కన.. సగటున ఒక్కో నెల 113.75 కోట్ల హుండీ ఆదాయం.. టీటీడీ ఖాతాకు జమవుతోంది. సగటున ఒక్క రోజు హుండీ ఆదాయం 3.73కోట్లుగా రికార్డ్‌లకెక్కింది. గతేడాదిలో జులై, ఆగస్టులో అత్యధికంగా 125 కోట్ల హుండీ ఆదాయం లభించింది.

భక్తులు సామాజిక, ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా కానుకల ప్రియుడైన శ్రీ వేంకటేశ్వరునికి వ్యవసాయ ఉత్పత్తులు, బెల్లం, నవధాన్యాలు, పశువులు, బంగారం, వాహనాలు, విలువైన రాళ్లు, విదేశీ కరెన్సీ, భూమితో సహా వివిధ కానుకలను సమర్పిస్తూ ఉంటారు. శ్రీవారికి ముడుపులు కట్టి హుండీలో భక్తులు చెల్లించే కానుకలు టీటీడీకి కోట్ల రూపాయల ఆదాయాన్ని సమకూర్చుతున్నాయి. తిరుమలేశుడి హుండీ ఆదాయం ప్రతీ నెలా వంద కోట్లు క్రాస్‌ అవుతుండడంతో వెంకన్న ఆదాయం అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఎంతలా అంటే.. కొవిడ్ తర్వాత గత 33 నెలలుగా వంద కోట్ల ట్రెండ్‌ కంటిన్యూ అవుతోంది. ఈ క్రమంలోనే.. సామాన్య భక్తుల నుండి సంపన్నుల వరకు హుండీలో సమర్పిస్తున్న కానుకలతో గతేడాది శ్రీవారి హుండీ ఆదాయం 1,365 కోట్ల రూపాయలు దాటింది. హుండీ ద్వారా వచ్చే ఆదాయం సగటున సాధారణ రోజుల్లో రూ.3.6 కోట్లు, వారాంతాల్లో రూ.3.85 కోట్లుగా ఉంది. డిసెంబర్ 31న ఆలయానికి హుండీ ఆదాయం రూ.4.10 కోట్లు వచ్చినట్లు టీటీడీ తెలిపింది. గత ఏడాది సుమారు 99 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కోళ్లకు అందాల పోటీలు.. వీటి రేటు ఎంతో తెలుసా ??

రైల్వే ట్రాక్ పై పబ్జీ ఆడారు.. సడన్ గా రైలు రావడంతో..

పాము కాటుకు దివ్య ఔషధం !! కేవలం 5 నిమిషాల్లోనే..

ఛీ.. తిని వదిలేసిన ఆహారంతో నూనె తయారీ.. తిరిగి దానితోనే వంటలు

ఇదెక్కడి బాదుడురా నాయనా !! సంక్రాంతికి టిక్కెట్ రేట్లు ఎంతో తెలుసా ??