జాన్వీ కపూర్‌లో ఆ అందం లేదు.. ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్!
వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు ఏం చేసినా అది వైరల్ అవుతుంది. ఒకప్పుడు టాలీవుడ్ ను షేక్ చేసే సినిమాలు చేసిన ఆర్జీవీ.. ఇప్పుడు కాస్త విభిన్నంగా సినిమాలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆర్జీవీ సంచలన పోస్ట్ లు చేస్తుంటారు. ఇటీవల పోలీస్ కేసులోనూ ఇరుక్కున్నారు. వ్యూహం సినిమా ప్రమోషన్స్ విషయంలో ఆర్జీవీ పై కేసు నమోదు అయ్యింది. ఇవన్నీ పక్కన పెడితే ఆర్జీవీకి శ్రీదేవి అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
శ్రీదేవి ఆర్జీవీ ఆరాధ్య దేవత. ఏ చిన్న సందర్భం దొరికినా ఆర్జీవీ శ్రీదేవి గురించే చెబుతుంటారు. ఆమె మరణం తర్వాత కూడా ఆర్జీవీ ఆమెను ఇష్టపడుతూనే ఉన్నారు. ఇప్పటికీ ఆమెను తలుచుకుంటూ ఉంటారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో శ్రీదేవి గురించి మాట్లాడుతూ.. శ్రీదేవిని ఎవరితో పోల్చడానికి లేదు అన్నారు. ఆమె అందం, అభినయం వేరెవరిలోనూ చూడలేమంటూ కామెంట్ చేసారు. శ్రీ దేవి నటిస్తుంటే అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుందనీ ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించినా..పదహారేళ్ల వయస్సు.. వసంత కోకిలలో ఆమె పెర్‌ఫార్మెన్స్ అద్భుతం అన్నారు. శ్రీదేవి స్క్రీన్ పై కనిపిస్తే తాను ఒక దర్శకుడిని అన్న విషయం మర్చిపోతాననీ చెప్పారు. అలాగే శ్రీదేవి కూతురు జాన్వికపూర్ గురించి మాట్లాడుతూ.. శ్రీదేవి అందం కూతురికి రాలేదనీ తనకు శ్రీదేవి అంటేనే ఇష్టమనీ జాన్వీలో శ్రీదేవి అందం లేదనీ తెలిపారు. ఆమెతో తాను సినిమా చేయను అని తెగేసి చెప్పాడు. వర్మ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
