ఎర్ర కలబందను చూశారా..?ప్రయోజనాలు తెలిస్తే వదిలి పెట్టరు!
కలబంద అనగానే మనకు గ్రీన్ కలర్ కలబందనే గుర్తుకు వస్తుంది. కానీ రెడ్ కలర్ కలబంద అనేది ఒకటుందని చాలా మందికి తెలియకపోవచ్చు. తరతరాలుగా సౌందర్య పోషణలో,చర్మ సంరక్షణలో కలబంద ముఖ్యపాత్ర వహిస్తూ వస్తుంది. ఈ కోవలోకి ఇపుడు మరో రెడ్ కలబంద వచ్చి చేరింది. అదే రెడ్ కలబంద. ఈ రెడ్ కలబంద ఇప్పుడు చర్మ సంరక్షణ మార్కెట్లోకి వేగంగా దూసుకొస్తోంది. మనం ఎప్పుడూ చూసే గ్రీన్ కలబందలో కన్నా ముదురు ఎరుపు రంగులో ఉండే కలబందలో పోషకాలు పుష్కలంగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
ఆకుపచ్చ కలబందతో పోలిస్తే ఎరుపు రంగు కలబందలో ఎక్కువ ఔషధ గుణాలున్నాయి. అందుకే ‘కింగ్ ఆఫ్ అలోవెరా’గా పేరు తెచ్చుకుంది. రెడ్ కలబందలో విటమిన్ ఎ, సి, ఇ, బి12, ఫోలిక్ యాసిడ్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్లు..ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి శరీరాన్ని రక్షిస్తాయి. పెద్ద మొత్తంలో అమైనో ఆమ్లాలు కలిగి ఉండటం వల్ల జుట్టు, చర్మం, కళ్ళకు ఒక వరంలాంటిదని నిపుణులు చెబుతున్నారు. చర్మ యవ్వనాన్ని కాపాడుతుంది. కాలుష్యం, ఒత్తిడి, వృద్ధాప్యం వల్ల కలిగే నష్టం నుండి చర్మాన్ని రక్షిస్తుంది. ఎర్ర కలబందను జుట్టు మీద అప్లై చేయడం వల్ల జుట్టు రాలే సమస్య తగ్గుతుంది.
వైరల్ వీడియోలు
Latest Videos