ఏకంగా 174 కిలోల బరువు తగ్గాడు.. చివరకు నిద్రలోనే..

ఏకంగా 174 కిలోల బరువు తగ్గాడు.. చివరకు నిద్రలోనే..

Samatha J

|

Updated on: Jan 07, 2025 | 6:45 PM

మనిషి కాస్త లావుగా ఉంటే..బాడీ షేమింగ్‌ చేస్తూ హేళన చేసే సమాజం మనది. అయితే తమ కొవ్వును కరిగించుకుని..తమలాంటి వాళ్లకి స్ఫూర్తిని కలిగించిన వాళ్లు మన చుట్టూ కనిపిస్తుంటారు. వాళ్లలో గేబ్రియల్‌ ఫెయిటస్‌ ప్రయాణం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అయితే ఆ జర్నీ ఇప్పుడు అర్థాంతరంగా ముగిసింది. గేబ్రియల్ ఫెయిటస్‌...174 కేజీల బరువు తగ్గి ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. బ్రెజిల్‌కు చెందిన గేబ్రియల్‌ వెయిట్‌లాస్‌ జర్నీ ఓ టీవీ షో ద్వారా పాపులర్‌ అయ్యింది. బరువు తగ్గాలనుకువాళ్లకి స్ఫూర్తిగా నిలిచింది

 ‘‘హాయ్‌.. నాపేరు గాబ్రియల్‌. వయసు 29 ఏళ్లు. ఒకప్పుడు నేను 320 కేజీల బరువు ఉండేవాడిని. ఎలాంటి సర్జరీలు లేకుండా, మందులు వాడకుండా బరువు తగ్గేందుకు నేను ప్రయత్నించా. ఆ ప్రయాణం మీరూ చూడండి..’’ అంటూ ఎనిమిదేళ్ల కిందట అతను పోస్ట్‌ చేసిన వీడియో తెగ వైరల్‌ అయ్యింది. ఇన్‌స్టాలో అతనికి 70 వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. బరువు తగ్గాలనుకునే ఎందరికో అతని పాఠాలు స్ఫూర్తిగా నిలిచాయి కూడా. అయితే ఆ తర్వాత ఆ ఫేమ్‌ ఎంతో కాలం నిలవలేదు. తండ్రిని, సోదరుడిని కోల్పోయాక మానసికంగా కుంగిపోయాడు. ఆ బాధలో మునుపటి అంతలా కాకపోయినా కాస్త బరువు పెరిగాడు. చివరకు డిసెంబర్‌ 30వ తేదీన నిద్రలోనే గుండెపోటుతో చనిపోయాడని అతని స్నేహితుడు రికార్డో ప్రకటించాడు. ‘‘మా వాడి మనసు బంగారం. ఎందరికో వాడి ప్రయాణం ఇన్‌స్పిరేషన్‌. అలాంటోడు ఏ నొప్పి లేకుండా ప్రశాంతంగా నిద్రలోనే కన్నుమూశాడు’’ అని తెలిపాడు.