డాకు మహారాజ్ టికెట్ రేట్స్ ఫిక్స్..ఇక బాక్సాఫీస్ దబిడిదిబిడే
నందమూరి బాలకృష్ణ, యువ దర్శకుడు బాబీ కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా డాకు మహారాజ్. సంక్రాంతి బరిలో ఉన్న ఈ మూవీ ఈ నెల 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్, పోస్టర్స్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. దీంతో ఈ సినిమా కోసం నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా, ఈ సినిమా టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
అలాగే ఈ చిత్రానికి అదనపు షోలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జనవరి 12న ఉదయం 4 గంటలకు స్పెషల్ బెనిఫిట్ షోకు అనుమతించింది. ఈ షోకి టికెట్ రేటును జీఎస్‌టీతో కలిపి రూ.500 గా నిర్ణయించింది. మొదటి రోజు నుంచి జనవరి 25 వరకు రోజుకు ఐదు షోలకు అనుమతి ఇచ్చింది. ఈ షోలకు మల్టీప్లెక్సుల్లో టికెట్‌పై రూ.135లు, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.110లు పెంపునకు అనుమతి ఇచ్చింది. కాగా, ఆదివారం అమెరికాలోని నందమూరి ఫ్యాన్స్ ఆధ్వర్యంలో చిత్ర యూనిట్ డల్లాస్‌లో ఘనంగా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌లోనే సినిమా ట్రైలర్ ని కూడా విడుదల చేసారు.
వైరల్ వీడియోలు
Latest Videos