TOP 9 ET News: పుష్ప2 ధాటికి గల్లంతైన బాహుబలి2 రికార్డ్

TOP 9 ET News: పుష్ప2 ధాటికి గల్లంతైన బాహుబలి2 రికార్డ్

Phani CH

|

Updated on: Jan 07, 2025 | 1:25 PM

పుష్ప2 మూవీ ధాటికి ఏకంగా బాహుబలి రికార్డ్ గల్లంతైపోయింది. ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర నమోదైన లెక్కల్లో 1810 కోట్లతో టాప్ ప్లేస్‌లో ఉంది బాహుబలి2. ఇప్పుడా రికార్డ్‌నే పుష్ప2 చెరిపేసింది. 32 రోజుల్లో ఏకంగా 1831కోట్లు వసూలు చేసింది. అత్యధిక కలెక్షన్స్ సాధించిన నయా టాప్ మూవీ గా హిస్టరీ కెక్కింది.

డిసెంబరు 4న ప్రీమియర్స్‌ షోస్‌తో ఇండియన్‌ బాక్సాఫీస్‌పై మొదలైన ‘పుష్ప-2’ ది రూల్‌ వసూళ్ల రికార్డుల పరంపర సరికొత్త అధ్యాయాన్ని సృష్టించింది. కేవలం 32 రోజుల్లోనే 1831కోట్లతో.. భారతీయ సినీ చరిత్రలో ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా కొత్త రికార్డును క్రియేట్‌ చేసింది పుష్ప2 మూవీ. అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా.. ఇండియన్ బాక్సాఫీస్ లెక్కల్లో టాప్ పొజీషన్‌కెక్కింది. గేమ్‌ ఛేంజర్‌ … గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ రెండు రోజుల క్రితం రాజమండ్రిలో జరిగింది. ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా విచ్చేసిన ఈ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. అయితే ఈ వేడుక అనంతరం తిరిగు ప్రయాణంలో అనుకోని ఘటన జరిగింది. కాకినాడ జిల్లా గైగోలుపాడుకు చెందిన ఆరవ మణికంఠ, తోకాడ చరణ్ తిరుగు ప్రయాణంలో బైకు పై ఇంటికి వెళుతూ.. ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

180 కి.మీ. వేగంతో దూసుకెళ్లినా.. గ్లాసు కదల్లేదు

మహిళలూ.. స్పై కెమెరాల విషయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి

ఓర్నీ.. గర్ల్‌ ఫ్రెండ్‌ కోసం ఎంత పని చేశాడు.. చివరికి

Madhavi Latha: మాట్లాడుతూ బోరున ఏడ్చేసిన మాధవీలత

తెలంగాణలోనూ ‘గేమ్ ఛేంజర్’ టికెట్ రేట్ల పెంపుపై దిల్ రాజు షాకింగ్ కామెంట్స్