180 కి.మీ. వేగంతో దూసుకెళ్లినా.. గ్లాసు కదల్లేదు
వందే భారత్ రైళ్లగురించి ప్రజలకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అత్యంత వేగంగా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చుతాయి. అయితే ఇప్పటి వరకూ కూర్చుని ప్రయాణించే రైళ్లే మనకు అందుబాటులోకి వచ్చాయి. అయితే దేశంలో మొట్టమొదటిసారిగా వందే భారత్ స్లీపర్ రైళ్లను పట్టాలు ఎక్కించేందుకు రైల్వే శాఖ ముమ్మర కసరత్తు చేస్తోంది. ఇందులోభాగంగానే రైలు వేగాన్ని క్రమక్రమంగా పెంచేందుకు పలు పరీక్షలు నిర్వహిస్తున్నారు.
ఈ పరీక్షల్లో రైలు గరిష్ఠంగా గంటకు 180 కిలోమీటర్ల వేగాన్ని అందుకున్నట్లు తెలిసింది. ఈమేరకు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఓ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో వందే భారత్ స్లీపర్ రైలు180 కి.మీ. వేగంతో రయ్‌రయ్‌మంటూ దూసుకెళ్లింది. అంత వేగంలోనూ రైల్లో సీటు వద్ద ఉన్న ట్రేపై పెట్టిన గ్లాసులో చుక్క నీరు కూడా కింద పడకపోవడం విశేషం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ సూచనల మేరకు రాజస్థాన్‌లోని కోటా రైల్వే డివిజన్‌లో ఈ పరీక్షలు నిర్వహించారు. తొలుత జనవరి 1న రైలును 130 కి.మీ. వేగంతో నడిపారు. ఆ తర్వాత వేగాన్ని 140, 150, 160కి పెంచారు. తాజాగా గురువారం ఈ వేగాన్ని గంటకు 180 కిలోమీటర్లకు పెంచారు. రాజస్థాన్‌లోని కోటా నుంచి లబాన్ స్టేషన్ల మధ్య 180 కి.మీ. వేగంతో దూసుకెళ్లింది. ఆ సమయంలో సాధారణ ప్రయాణికులను సమం చేసేంత బరువును రైల్లో ఉంచారు. విభిన్నమైన ట్రాక్ పరిస్థితుల్లో దీన్ని పరీక్షించారు. వచ్చే నెలలోనూ ఈ ట్రయల్స్ కొనసాగుతాయని అధికారులు వెల్లడించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మహిళలూ.. స్పై కెమెరాల విషయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి
ఓర్నీ.. గర్ల్ ఫ్రెండ్ కోసం ఎంత పని చేశాడు.. చివరికి
Madhavi Latha: మాట్లాడుతూ బోరున ఏడ్చేసిన మాధవీలత
తెలంగాణలోనూ ‘గేమ్ ఛేంజర్’ టికెట్ రేట్ల పెంపుపై దిల్ రాజు షాకింగ్ కామెంట్స్