Ayodhya: రామాలయంలో కళ్లద్దాలతో ఓ యువకుడు.. అనుమానంతో ఆరా తీయగా
అయోధ్యలోని రామమందిరంలో అత్యంత పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు ఉన్నాయి. భద్రతా చర్యల్లో భాగంగా ఆలయ కాంప్లెక్స్ లోపన ఫొటోలు, వీడియోలు తీయడాన్ని నిషేధించారు. అయితే ఓ యువకుడు రహస్య కెమెరాలున్న కళ్లద్దాలు ధరించి ఆలయం లోపల రహస్యంగా ఫొటోలు తీసేందుకు ప్రయత్నించాడు. భద్రతా సిబ్బందికి దొరికిపోవడంతో ఇప్పుడు కటకటాలపాలయ్యాడు.
రహస్య కెమెరాతో అయోధ్య రామమందిరంలో ఫొటోలు తీసేందుకు యత్నించిన ఓ వ్యక్తిని భద్రతా సిబ్బంది అరెస్టు చేశారు. అయోధ్య రామాలయంలో అత్యంత పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు అమలులో ఉన్నాయి. భద్రత దృష్ట్యా రామమందిర్ కాంప్లెక్స్‌లో ఫొటోలు, వీడియోలు తీయడాన్ని నిషేధించారు. కానీ, ఓ యువకుడు భద్రతా నియమాలను ఉల్లంఘించి.. ఆలయంలో లోపల రహస్య కెమెరాతో ఫొటోలు తీసేందుకు ప్రయత్నించాడు. తన హైటెక్ సన్‌గ్లాసెస్‌కు రహస్యంగా కెమెరాను అమర్చుకుని ఎవరికీ అనుమానం రాకుండా ఆలయ కాంప్లెక్స్ లోపలకు ప్రవేశించాడు. ఆలయ కాంప్లెక్స్ లోపలికి వెళ్లాక ఎవరికీ తెలీకుండా ఫొటోలు తీయడం ప్రారంభించాడు. ఆ సమయంలో కళ్లద్దాల చివర్లో వెలుగు కనిపించడంతో భద్రతా సిబ్బంది ఆ వ్యక్తిని అడ్డుకున్నారు.
భద్రతా సిబ్బంది కళ్లద్దాలను తనిఖీ చేయగా అందులో రహస్య కెమెరా ఉన్నట్లు గుర్తించారు. రామమందిరంలో భద్రతను ఉల్లంఘించినందుకు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని గుజరాత్‌లోని వడోదరకు చెందిన జానీ జైకుమార్‌గా గుర్తించారు.
ఆలయంలోని గర్భగుడిలో రహస్యంగా ఫొటోలు తీసే ఉద్దేశంతో ఆ వ్యక్తి ఈ రహస్య కెమెరాతో లోనికి ప్రవేశించినట్లు పోలీసులు తెలిపారు. ఆలయంలో రహస్యంగా ఫొటోలు తీయడం వెనుక మరేదైనా కుట్ర కోణం ఉందా అన్న దానిపై కూడా భద్రతా సిబ్బంది ఆ వ్యక్తిని ప్రశ్నించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.
రహస్య కెమెరా కలిగిన కళ్లద్దాలు..
राम मंदिर अयोध्या में चश्मे के अंदर फिट कैमरे से अंदर की तस्वीरें लेता युवक पकड़ा !!
ये युवक गुजरात के वडोदरा का जयकुमार है। पुलिस और खुफिया एजेंसियां पूछताछ कर रही हैं।
राम मंदिर परिसर में मोबाइल ले जाना और तस्वीरें खींचना प्रतिबंधित है। pic.twitter.com/dG94oyIAW1
— Sachin Gupta (@SachinGuptaUP) January 7, 2025