AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPFO: పీఎఫ్ ఖాతాదారులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. త్వరలోనే అకౌంట్లోకి డబ్బులు.. చెక్ చేసుకోండిలా..

పీఎఫ్ ఖాతాదారులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూన్న రోజు రానే వచ్చింది. ఈపీఎఫ్ వడ్డీ రేట్లపై కేంద్రం స్పష్టత ఇచ్చింది. సోమవారం ఈపీఎఫ్‌వో ట్రస్టీల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వడ్డీ రేట్లను నిర్ణయించారు. ఈపీఎఫ్ డిపాజిట్లపై వడ్డీ రేటను యథాతధంగా ఉంచారు.

EPFO: పీఎఫ్ ఖాతాదారులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. త్వరలోనే అకౌంట్లోకి డబ్బులు.. చెక్ చేసుకోండిలా..
Epfo 2
Venkatrao Lella
|

Updated on: Mar 03, 2026 | 12:16 PM

Share

ఈపీఎఫ్‌వో ఖాతాదారులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న వడ్డీ రేట్లపై క్లారిటీ వచ్చేసింది. ఈపీఎఫ్ బ్యాలెన్స్‌పై 2026-27 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి వార్షిక వడ్డీ రేటును నిర్ణయించారు. ఈ మేరకు సోమవారం జరిగిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశంలో ఈపీఎఫ్‌వో కీలక ప్రకటన చేసింది. ఈ ఆర్ధిక సంవత్సరానికి పీఎఫ్ డిపాజిట్లపై వడ్డీ రేటును 8.25 శాతంగా కొనసాగించాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించారు. దీంతో గత మూడేళ్లుగా వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు. ఈపీఎఫ్‌వో తన నిర్ణయాన్ని ఆర్ధికశాఖకు పంపనుంది. ఆర్ధికశాఖ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చాక వడ్డీని ఖాతాదారుల అకౌంట్లలో జమ చేశారు.

త్వరలోనే జమ

కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన తర్వాత వడ్డీ సొమ్ము పీఎఫ్ అకౌంట్లలో జమ అవుతుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 7 కోట్లకుపైగా మంది చందాదారులు ఉన్నారు. వీరందరికీ కేంద్రం నుంచి డబ్బులు జమ కానున్నాయి. మీ అకౌంట్లో ఈ వడ్డీ సొమ్ము జమ అయ్యాయా.. లేదా అనేది సులభంగా తెలుసుకోవచ్చు. ఇందుకోసం 4 మార్గాలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ఆన్ లైన్ పోర్టల్, ఎస్‌ఎంఎస్, మిస్డ్ కాల్, ఉమాంగ్ యాప్ ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. ఈ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం ద్వారా మీకు వడ్డీ జమ అయిందా.. లేదా అనేది తెలిసిపోతుంది.

మిస్డ్ కాల్ ద్వారా..

పీఎఫ్ అకౌంట్‌తో లింక్ అయిన మొబైల్ నెంబర్ నుంచి టెక్ట్స్ రూపంలో మెస్సేజ్ పంపాల్సి ఉంటుంది. “EPFOHO మీ UAN నెంబర్ ఫార్మట్‌లో 7738299899కు ఎస్‌ఎమ్మెస్ పంపాలి. మీ బ్యాలెన్స్ ఎంత అనేది ఎస్సెమ్మెస్ రూపంలో వస్తుంది. ఇక 9966044425 నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇచ్చి కూడా తెలుసుకోవచ్చు.

ఉమాంగ్ యాప్ ద్వారా..

-ఉమాంగ్ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకోండి

-మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌తో లాగిన్ అవ్వాలి

-ఈపీఎఫ్‌వో సేవలను ఎంచుకుని పాస్ బుక్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి

-మీ యూఏఎన్ నెంబర్ ఎంటర్ చేయాలి

-రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీ ఎంటర్ చేయాలి

-మీ కంపెనీ రిజిస్ట్రేషన్ ఐడీని ఎంచుకోవాలి

-పాస్ బుక్‌ని డౌన్ లోడ్ చేసుకోవాలి

ఈపీఎఫ్‌వో పోర్టల్ ద్వారా..

-EPFO ​​అధికారిక వెబ్‌సైట్ epfindia.gov.inను సందర్శించండి

-“సేవలు” అనే విభాగంలోకి వెళ్లి ఎంప్లాయిస్ ఆప్షన్ ఎంచుకోండి

-పాస్‌బుక్ ఆప్షన్ ఎంచుకుంటే కొత్త లాగిన్ పేజీ తెరవబడుతుంది

-మీ UAN నెంబర్, పాస్‌వర్డ్, క్యాప్చా కోడ్‌ను నమోదు చేయాలి

-పాస్ బుక్‌లో మీ బ్యాలెన్స్ చెక్ చేసుకోండి

Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర