Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహిళ శరీర నిర్మాణంపై మాట్లాడటం కూడా లైంగిక వేధింపులతో సమానం.. కేరళ హైకోర్టు సంచలన తీర్పు..

కేరళ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. మహిళల శరీర నిర్మాణం - ఆకృతి గురించి వ్యాఖ్యానించడం లైంగిక వేధింపులతో సమానమని కేరళ హైకోర్టు పేర్కొంది.. జెండర్ కలర్ తో కూడిన వ్యాఖ్యలతోపాటు మహిళ శరీర నిర్మాణంపై వ్యాఖ్యానించడం లైంగిక వేధింపులతో సమానమని తీర్పును వెలువరించింది. అలా వ్యాఖ్యానించడం తగదని.. ఈ కేసును కొనసాగించాలని పేర్కొంది

మహిళ శరీర నిర్మాణంపై మాట్లాడటం కూడా లైంగిక వేధింపులతో సమానం.. కేరళ హైకోర్టు సంచలన తీర్పు..
Kerala High Court
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jan 08, 2025 | 10:13 AM

కేరళ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. మహిళల శరీర నిర్మాణం – ఆకృతి గురించి వ్యాఖ్యానించడం లైంగిక వేధింపులతో సమానమని కేరళ హైకోర్టు పేర్కొంది.. జెండర్ కలర్ తో కూడిన వ్యాఖ్యలతోపాటు మహిళ శరీర నిర్మాణంపై వ్యాఖ్యానించడం లైంగిక వేధింపులతో సమానమని తీర్పులో వెల్లడించింది.. లైంగిక వేధింపుల ఘటనలో ఒక వ్యక్తిపై నమోదైన క్రిమినల్ కేసులను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను జస్టిస్ ఎ. బదరుద్దీన్ నేతృత్వంలోని న్యాయస్థానం తోసిపుచ్చింది. నిందితుడు భారతీయ శిక్షాస్మృతి (IPC) సెక్షన్లు 354A(1)(iv), 509, కేరళ పోలీసు చట్టం (KP చట్టం) సెక్షన్ 120(o) కింద లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.. అంతేకాకుండా ప్రాసిక్యూషన్ ఆరోపణలకు మద్దతునిచ్చే ప్రాథమిక సాక్ష్యాలను సైతం పరిగణలోకి తీసుకుంది..

2017లో కేరళ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ లిమిటెడ్ (KSEB) మాజీ ఉద్యోగి అయిన నిందితుడు.. ఫిర్యాదుదారుని శరీరంపై లైంగిక రంగుల వ్యాఖ్యలు చేసి, ఆమెకు అనుచిత సందేశాలు పంపిన సంఘటనల నుంచి ఈ కేసు ఉద్భవించింది. 2017 మార్చి 31న పని వేళల్లో నిందితుడు లైంగిక ఉద్దేశంతో తన శరీర నిర్మాణంపై వ్యాఖ్యానించాడని, KSEBలో సీనియర్ అసిస్టెంట్ అయిన డిఫాక్టో ఫిర్యాదుదారులు ఆరోపించింది.. 2017 లో జూన్ 15, 17, తోపాటు.. 20, తేదీల్లో మరిన్ని సంఘటనలు జరిగాయి.. నిందితుడు ఆమె మొబైల్ ఫోన్‌కు అనుచిత సందేశాలు పంపినట్లు నివేదించింది.. నిందితుడి దుష్ప్రవర్తన 2013 నాటిదని.. అతని ప్రవర్తనపై ఫిర్యాదులు నిరంతరంగా ఉన్నాయని ఫిర్యాదుదారులు ఆరోపించింది.. KSEB అధికారులకు, పోలీసులకు అనేకసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ, నిందితుడు తన వేధింపులను కొనసాగించాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది.

ఆరోపణలు ఎదుర్కొంటున్న పిటిషనర్ తరఫు న్యాయవాది వాదిస్తూ, ఆరోపణలు సెక్షన్లు 354A(1)(iv), 509 IPC లేదా సెక్షన్ 120(o) KP చట్టం ప్రకారం నేరాలుగా పరిగణించబడవని.. ఒకరి శరీర నిర్మాణాన్ని సూచించే వాటిని లైంగిక వేధింపుల వ్యాఖ్యలుగా వర్గీకరించలేమని పేర్కొన్నారు.

నిందితుడిపై వచ్చిన ఆరోపణలను కోర్టు విశ్లేషించి తీర్పును వెల్లడించింది… “ ఏ వ్యక్తి అయినా స్త్రీని ఉద్దేశించి లైంగిక రంగుల వ్యాఖ్యలు చేస్తే లైంగిక వేధింపుల నేరానికి పాల్పడినట్లే’’ అంటూ పేర్కొంది.

నిందితుల వాదనలతో ఏకీభవించని కోర్టు, ఈ కేసులో ఆరోపించినట్లుగా లైంగిక రంగుల వ్యాఖ్యలు స్పష్టంగా IPC సెక్షన్ 354A(1)(iv) కిందకు వస్తాయని నొక్కి చెప్పింది. అదేవిధంగా, పిటిషనర్ పదే పదే పంపిన సందేశాలు KP చట్టంలోని సెక్షన్ 120(o) ప్రకారం నేరంగా పరిగణించబడతాయి.. ఇది నేరం.. జరిమానా కూడా విధించవచ్చని తెలిపింది.

ప్రాసిక్యూషన్ మెటీరియల్స్ ఆధారంగా, పిటిషనర్ చర్యలు కేసును కొనసాగించడానికి ప్రాథమికంగా సరిపోతాయని కోర్టు గమనించింది. నిశ్చయంగా, నిందితులపై క్రిమినల్ ప్రొసీడింగ్‌లను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది.. ఈ కేసును కొనసాగించాల్సిందిగా అధికార పరిధి మేజిస్ట్రేట్‌ను ఆదేశించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..