Viral: చెత్త డంపింగ్ యార్డు క్లీన్ చేస్తుండగా బయటపడింది చూసి.. ఆశ్చర్యపోయిన జనం..

డంపింగ్ యార్డు ప్రాంతాన్ని క్లీన్ చేస్తుండగా.. లోపల శివాలయం బయటపడింది. దాని లోపల, రెండు ప్రత్యేకమైన పాదముద్రలు, ఒక పురాతన శివలింగం కూడా కనుగొన్నారు. దీంతో ఆ ప్రాంతం ప్రార్థనా స్థలంగా మారింది. స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం, ఆలయాన్ని మృదువైన నల్లని రాతితో నిర్మాణం చేశారు. పూర్తి డీటేల్స్ తెలుసుకుందా పదండి..

Viral: చెత్త డంపింగ్ యార్డు క్లీన్ చేస్తుండగా బయటపడింది చూసి.. ఆశ్చర్యపోయిన జనం..
Shiva Temple
Follow us
Ram Naramaneni

|

Updated on: Jan 08, 2025 | 11:13 AM

ఆ ప్రాంతంలో చెత్త డంపింగ్ యార్డు ఉండేది. అందరూ వేస్ట్ తీసుకొస్తూ అక్కడే పడేస్తూ ఉండేవారు. కానీ ఆ చెత్త కుప్ప కింద ఓ పురాతన దేవాలయం ఉందన్న సంగతి చాలా లేటుగా బయటపడింది.  బీహార్ రాజధాని పాట్నాలో 500 సంవత్సరాల పురాతన శివాలయం బయల్పడింది. డంపింగ్ యార్డ్ ప్రాంతాన్ని శుభ్రపరుస్తుండగా వార్డ్ నెం. 54లో ఈ పురాతన దేవాలయాన్ని కనుగొన్నారు.  ఈ స్థలం ఒకప్పుడు మఠానికి అనుసంధానించబడినదిగా చెబుతున్నారు. ఈ ఘటన స్థానికంగా ఉత్సుకతను రేపింది. శివాలయం బయల్పడిన విషయం తెలియండతో స్థానికులు పెద్ద ఎత్తున ఆ ప్రాంతానికి తరలివస్తున్నారు. ఆ ప్రాంతంలో  ఆధ్యాత్మిక సంబంరం మొదలైంది.

స్థానికులు స్వయంగా ప్రాథమిక తవ్వకాలు చేపట్టారు. శిధిలాలు తొలగించబడిన తర్వాత, పూర్తి నిర్మాణం వెలుగుచూసింది. అందరూ కలిసి ఆ ప్రాంతాన్ని శుభ్రపరిచారు. లోపల, ఒక పురాతన శివలింగం, రెండు ప్రత్యేకమైన పాదముద్రలు ఉన్నాయి.  ఆలయం ఒక విలక్షణమైన లోహ పదార్థంతో తయారు చేయబడిందని, దాని గోడలపై అంతుచిక్కని విధంగా నీటి చెమ్మ రావడాన్ని స్థానికులు గుర్తించారు. ఎంతో సుందరంగా అప్పట్లో నల్లరాతితో ఆలయాన్ని నిర్మించినట్లు చెప్పుతున్నారు. అప్పటివరకు చెత్తకుప్పగా ఉన్న ఆ స్థలం.. అంతలోనే ప్రార్థనా స్థలంగా మార్చింది.

ప్రస్తుతం ఈ ఆలయం గురించి పురావస్తు శాఖ వారు పరిశోధనలు చేపట్టారు. ఈ ఆలయం 15వ శతాబ్దానికి చెందినదిగా నిపుణులు భావిస్తున్నారు. ఈ శివాలయం గురించి వార్తలు వైరల్ అయినప్పటి నుండి, చాలా మంది ప్రజలు..పూజలు చేసేందుకు ఆ ప్రాంతానికి వస్తున్నారు. భక్తులు సంఘటనా స్థలానికి వచ్చి పూలు, పాలు, స్వీట్లు సమర్పించే వీడియోలు బయటకు వచ్చాయి. మొత్తం తవ్వకం పూర్తికాకముందే కొందరు ఆ ప్రాంతాన్ని పూలతో అలంకరించారు.  పాట్నాలో ఇలాంటి ఆవిష్కరణలు జరగడం కొత్తేమీ కానప్పటికీ, బీహార్ రాజధాని నగరంలో శివలింగంతో చెక్కుచెదరకుండా ఉన్న ఆలయ నిర్మాణం బయటపడటం ఇదే మొదటిసారి. (Source)

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..