Sankranti Special Snacks: చెరుకు రసంతో తీపి జంతికలు చేయండి.. పిల్లలు ఇష్టపడి మరీ తింటారు..
పండుగకు చేసే స్నాక్స్ కూడా చాలా స్పెషల్. ఎక్కువగా జంతికలు తయారు చేస్తూ ఉంటారు. వీటినే మురుకులు అని కూడా పిలుస్తారు. సాధారణంగా వీటిని కారంగా తయారు చేస్తారు. కానీ మనం వీటిని చెరుకు రసం కలిపి చేస్తే ఆహా ఆ రుచే వేరు. చాలా బాగుంటాయి. ఎక్కువగా పిల్లలకు మరింత నచ్చుతాయి. బాక్సులో వీటిని స్నాక్స్‌లా పెడితే బాక్స్ ఖాళీ అవుతుంది..
సంక్రాంతి పండుగ దగ్గర పడింది. ఈ ఏడాది జనవరి 13వ తేదీ నుంచి పండుగ ప్రారంభం అవుతుంది. సంక్రాంతి పండుగ వస్తుందంటే అందరూ ఆంధ్రప్రదేశ్‌కి క్యూ కడతారు. ఇక్కడ వేసే కోళ్ల పందాలను చూడటం కోసం ఎక్కడి నుంచో వస్తారు. అలాగే పండుగకు చేసే స్నాక్స్ కూడా చాలా స్పెషల్. ఎక్కువగా జంతికలు తయారు చేస్తూ ఉంటారు. వీటినే మురుకులు అని కూడా పిలుస్తారు. సాధారణంగా వీటిని కారంగా తయారు చేస్తారు. కానీ మనం వీటిని చెరుకు రసం కలిపి చేస్తే ఆహా ఆ రుచే వేరు. చాలా బాగుంటాయి. ఎక్కువగా పిల్లలకు మరింత నచ్చుతాయి. బాక్సులో వీటిని స్నాక్స్‌లా పెడితే బాక్స్ ఖాళీ అవుతుంది. పిల్లల కోసం ఏం చేయాలా అని ఆలోచించేవారికి.. ఈ రెసిపీ పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. మరి ఈ తీపి జంతికలు ఎలా తయారు చేస్తారు? ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడే చూద్దాం.
తీపి జంతికలకు కావాల్సిన పదార్థాలు:
చెరుకు రసం, బియ్యం పిండి, నువ్వులు, ఉప్పు, బటర్ లేదా బేకింగ్ సోడా, ఆయిల్.
తీపి జంతికలకు తయారీ విధానం:
ముందుగా ఓ గిన్నె తీసుకుని అందులో బియ్యం పిండి వేసుకోండి. అందులో కొద్దిగా ఉప్పు, నువ్వులు, బటర్ లేదా బేకింగ్ సోడా వేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. నీళ్లకు బదులు చెరు రసం వేసి మొత్తం పిండిని మిక్స్ చేసుకోవాలి. ఈ పిండిని చపాతీ పిండిలా కలుపుకోవాలి. పిండిని కలుపుకున్న తర్వాత ఓ పావుగంట పక్కన పెట్టాలి. ఈలోపు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కగానే.. జంతికల గొట్టం ద్వారా.. పిండిని తీసుకుని ఆయిల్లో వేసి ఫ్రై వేసుకోవాలి. వీటిని రెండు వైపులా ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే చెరుకు రసం జంతికలు సిద్ధం. ఇవి చాలా రుచిగా ఉంటాయి. పిల్లలు మరింత ఇష్ట పడి మరీ తింటారు. అందులోనూ ఇందులో నువ్వులు కూడా ఉంటాయి. ఈ రెసిపీ ఆరోగ్యానికి చాలా మంచిది.