AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Healthy Vegetables: ఈ కూరగాయలకు తొక్క తీయకుండా తింటేనే ఆరోగ్యమట..

మాంసాహారం కంటే కూరగాయలు తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని చాలా మంది చెబుతూ ఉంటారు. కూరగాయలు తినడం హెల్త్‌కి కూడా ఎంతో మేలు. అయితే కొన్ని రకాల కూరగాయలకు తొక్క తీసి తింటారు. అలా వాటికి తొక్క తీసి తినడం వల్ల అనేక పోషక విలువలను కోల్పోతామని న్యూట్రిషియన్లు అంటున్నారు..

Healthy Vegetables: ఈ కూరగాయలకు తొక్క తీయకుండా తింటేనే ఆరోగ్యమట..
Healthy Vegetables
Chinni Enni
| Edited By: Shaik Madar Saheb|

Updated on: Jan 07, 2025 | 10:23 PM

Share

కూరగాయల్లో ఎన్నో రకాల ఉంటాయి. మనకు నచ్చినవి తెచ్చుకుని తింటూ ఉంటారు. కూరగాయలు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. కూరగాయల్లో ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు చాలా లభిస్తాయి. ప్రతి రోజూ కూరగాయలు తినడం వల్ల ఎలాంటి వ్యాధులు త్వరగా రాకుండా ఉంటాయి. అయితే కొన్ని రకాల కూరగాయల్ని ఎలా తినాలో చాలా మందికి తెలీదు. కొన్నింటికి తొక్క తీసి.. మరికొన్నింటిని నేరుగా వండి తింటూ ఉంటారు. కానీ కొన్ని రకాల కూరగాయల్ని మాత్రం తొక్కతో తింటేనే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలా తింటేనే పోషకాలు అందుతాయని అంటున్నారు. మరి ఆ కూరగాయలు ఏంటో ఇప్పుడే చూసేయండి.

బంగాళ దుంపలు:

చాలా మంది ఆలు గడ్డలకు తొక్క తీసి వండి తింటూ ఉంటారు. అలా తింటేనే మంచిది అనుకుంటారు. నిజానికి బంగాళ దుంప తొక్కలో కూడా పోషకాలు ఉంటాయి. ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. తొక్కతో తింటే ఎర్ర రక్త కణాల పనితీరును మెరుగు పరుస్తుంది. జీర్ణ వ్యవస్థకు కూడా మేలు చేస్తుంది. కాబట్టి శుభ్రంగా కడిగి తొక్కతో తినేందుకు ట్రై చేయండి.

బీరకాయలు:

తొక్కతో పాటు కలిపి తినాల్సిన కూరగాయల్లో బీరకాయలు కూడా ఒకటి. వీటిని కూడా తొక్కతో తింటేనే మరిన్ని పోషకాలు అందుతాయి. బీరకాయ తొక్కలో కూడా ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అలాగే విటమిన్ సి, పొటాషియం వంటివి కూడా లభిస్తాయి. పొట్టుతో తింటే జీర్ణ వ్యవస్థ, ఎముకలు, గుండె ఆరోగ్యం, ఒత్తిడి కంట్రోల్ అవుతాయి.

ఇవి కూడా చదవండి

క్యారెట్లు:

క్యారెట్లను కూడా తొక్కతో పాటు తింటేనే ఆరోగ్యం. ఉప్పు, పసుపు వేసి శుభ్రంగా క్లీన్ చేస్తే.. పైన ఉండే మురికి పోతుంది. తొక్క తీయకుండానే క్యారెట్ తినాలి. మందులు వాడుతూ ఉంటారని పైన తొక్క తీసేస్తారు. కానీ దీని వల్ల పోషకాలు తగ్గుతాయి.

వంకాయ:

చాలా మంది వంకాయకు కూడా స్కిన్ తీసేస్తూ ఉంటారు. ఉప్పు వేసిన నీటితో శుభ్రంగా క్లీన్ చేస్తే.. తొక్క తీయాల్సిన పని ఉండదు. వంకాయను తొక్కతో పాటు తింటేనే ఆరోగ్యానికి మేలు. పైన లేయర్‌లోనే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి అనేక పనులను నిర్వర్తిస్తుంది.

కీరా దోసకాయ:

కీరా దోసకాయకు కూడా తొక్క తీయకుండా తింటేనే మంచిది. ఈ తొక్కలోనే ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు లభిస్తాయి. ఇవి శరీరానికి చాలా మేలు చేస్తుంది. రక్త ప్రసరణను మెరుగ్గా నిర్వహించేందుకు హెల్ప్ చేస్తుంది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు