టీ, కాఫీ ప్రియులకు గుడ్ న్యూస్.. వీటిని తాగితే ఎన్ని లాభాలో తెలుసా
ఉదయాన్నే వేడి వేడిగా ఓ కప్పు కాఫీ, లేదా టీ తో రోజును ప్రారంభిస్తారు చాలామంది. ఒక్కరోజు టీ తాగకపోయినా ఎంతో లోటుగా ఫీలవుతారు. టీ, కాఫీ తాగనిదే అడుగు ముందుకు పడదంటే అతిశయోక్తి కాదు. ఇది ఆరోగ్యానికి మంచిది కాదని హెచ్చరించినా అలవాటు మానుకోలేక వాటిని పట్టించుకోరు. ఇలాంటి వారికి నిజంగా ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి.
టీ లేదా కాఫీ తాగే అలవాటు ఉన్నవారిలో తల, మెడ క్యాన్సర్ ముప్పు తగ్గవచ్చని ‘క్యాన్సర్ జర్నల్’లో ప్రచురితమైన అమెరికన్ క్యాన్సర్ సొసైటీ అధ్యయనం పేర్కొంది. ‘ఇంటర్నేషనల్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ ఎపిడెమియాలజీ కన్సార్టియం’ నిర్వహించిన ఈ అధ్యయనంలో టీ, కాఫీ వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. పరిశోధకులు. దాదాపు 14 రీసెర్చ్‌లకు సంబంధించిన డేటాను విశ్లేషించారు. అంతేకాదు, తల, మెడ క్యాన్సర్‌తో బాధపడుతున్న 9,500 మందికి పైగా రోగులను, క్యాన్సర్ లేని 15,700 మందిని పరీక్షించారు. ప్రతి రోజూ టీ, కాఫీలు తాగేవారిలో తల, మెడ క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని పరిశోధకులు తేల్చారు. నోరు, గొంతు, స్వరపేటికకు సంబంధించిన క్యాన్సర్లు వచ్చే ముప్పు తక్కువని తేలినట్టు పేర్కొన్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆ స్టార్ డైరెక్టర్ వల్లే నా కెరీర్ డ్యామేజ్ అయింది.. సీరియల్ హీరో ఆవేదన
Kanguva: ఇదేందిది.. ఆస్కార్ బరిలో కంగువ మూవీ !!
సమంత గురించి మనసులో మాట బయటపెట్టిన చరణ్
బ్లాక్ టైగర్ ను ఎప్పుడైనా చూశారా ?? దేశంలో ఎక్కడెక్కడున్నాయో తెలుసా ??
75 లగ్జరీ వాచ్‌లు.. 200 డిజైనర్ బ్యాగులు, థాయ్ ప్రధాని ఎంత రిచ్చో..