సమంత గురించి మనసులో మాట బయటపెట్టిన చరణ్‌

సమంత గురించి మనసులో మాట బయటపెట్టిన చరణ్‌

Phani CH

|

Updated on: Jan 08, 2025 | 12:44 PM

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ గేమ్ ఛేంజర్. డైరెక్టర్ శంకర్ మొదటిసారి తెలుగులో రూపొందిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తొలిసారిగా చరణ్ నటిస్తోన్న ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామాపై భారీ హైప్ ఏర్పడింది. ఈ క్రమంలోనే కొద్దిరోజులుగా ఈ మూవీ ప్రమోషన్లలో పాల్గొంటున్నారు రామ్ చరణ్.

ఇటీవలే బాలకృష్ణ హోస్టింగ్ చేస్తున్న అన్‏స్టాపబుల్ టాక్ షోలో పాల్గొన్న చరణ్.. తన పర్సనల్ విషయాల గురించి చెప్పుకొచ్చారు. అలాగే ఇండస్ట్రీలోని నటీనటుల గురించి కూడా మాట్లాడారు. ఇదే షోలో చరణ్ తోపాటు తన స్నేహితులు శర్వానంద్, నిర్మాత విక్రమ్ వచ్చారు. అలాగే నిర్మాత దిల్ రాజ్ కూడా వచ్చారు. ఇందుకు సంబంధించిన ఎపిసోడ్ ప్రోమోను ఆహా విడుదల చేసింది. అయితే ఈ షోలో బాలయ్య చరణ్ ను ఇరుకున పెట్టే ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. సమంత, కియారా అద్వానీ, ఆలియా భట్ లలో ఎవరిని ఉత్తమ నటిగా ఎన్నుకుంటావ్ అని చరణ్‌ను బాలయ్య అడగ్గా.. ఉత్తమ నటిగా సమంతను ఎన్నుకున్నారట చరణ్. ఇక సమంత గురించి ఏం చెప్పారో తెలియాలంటే జనవరి 8న ఆహాలో ప్రసారమయ్యే అన్‏స్టాపబుల్ ఎపిసోడ్ చూడాల్సిందే.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బ్లాక్ టైగర్ ను ఎప్పుడైనా చూశారా ?? దేశంలో ఎక్కడెక్కడున్నాయో తెలుసా ??

75 లగ్జరీ వాచ్‌లు.. 200 డిజైనర్ బ్యాగులు, థాయ్ ప్రధాని ఎంత రిచ్చో..

రజనీకాంత్‌కు గుడి కట్టి పూజలు చేస్తోన్న రిటైర్డ్ జవాన్..

ఎన్ని కోట్లు పెట్టి కొంటే ఏం లాభం.. ఆఖరికి ఎడ్ల బండితో లాగాల్సి వచ్చింది

లాటరీ చరిత్రను తిరగరాసే ఘటన.. రూ.10 వేల కోట్ల జాక్‌పాట్‌ టిక్కెట్ అమ్మకం !!