లాటరీ చరిత్రను తిరగరాసే ఘటన.. రూ.10 వేల కోట్ల జాక్‌పాట్ టిక్కెట్ అమ్మకం !!
అదృష్ట దేవత ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో చెప్పలేం. కానీ, ఒక్కసారి అనుగ్రహించిందంటే చాలు.. జీవితాలే మారిపోతాయి. కడు పేదరికంలో ఉన్నవారు కూడా ఓవర్ నైట్ లో ధనవంతులైపోతారు. లాటరీలలో భారీ మొత్తాలను గెలుచుకున్న వారి గురించి గతంలో చాలా కథనాల్లో తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చిన సంఘటనలో కాలిఫోర్నియాలోని ఓ చిన్న కుటుంబం ఏకంగా 10వేల కోట్ల రూపాయల లాటరీ టికెట్ ను విక్రయించింది.
కాలిఫోర్నియా లోని కాటన్‌వుడ్‌లో ఒక చిన్న కుటుంబం ఓ చిన్న స్టోర్ నడుపుతోంది. ఆ కుటుంబం ఇటీవల 1.22 బిలియన్ డాలర్ల విలువైన లాటరీ టికెట్ విక్రయించి వార్తల్లో నిలిచింది. ఇది లాటరీ చరిత్రలోని అతిపెద్ద జాక్‌పాట్‌లలో ఒకటిగా నిలవడంతో.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే హాట్‌టాపిక్‌గా మారింది. ఈ లాటరీ ఎవరు గెలిచారు అనేదానికి సంబంధించిన వివరాలు.. టికెట్స్ విక్రయదారులు వెల్లడించలేదు. కానీ కాటన్‌వుడ్ సిటీలోని రోండారోడ్‌లోని సర్కిల్‌లోని ఓ స్టోర్‌లో ఈ టికెట్‌ను కొనుగోలు చేశారని సమాచారం. ఈ స్టోర్ ను జస్పాల్ సింగ్.. అతని కుమారుడు ఇషార్ గిల్ నిర్వహిస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TOP 9 ET News: పుష్ప2 ధాటికి గల్లంతైన బాహుబలి2 రికార్డ్
180 కి.మీ. వేగంతో దూసుకెళ్లినా.. గ్లాసు కదల్లేదు
మహిళలూ.. స్పై కెమెరాల విషయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి
ఎట్టెట్లా.. కైలాస పర్వతాన్ని ఎక్కేశాడా?.. ఎవరు? ఎప్పుడు?
నదిలో వేయి లింగాలు.. ఆ మిస్టరీ ఏంటంటే..
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!

