విశాఖ సెంట్రల్ జైల్లో గంజాయి మొక్క కనిపించినట్లు ఏపీ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. విశాఖ సెంట్రల్ జైల్ను సందర్శించిన ఆమె.. గత వైసీపీ ప్రభుత్వ తప్పిదాల కారణంగానే జైల్లో వరుస తప్పిదాలు జరుగుతున్నాయని చెప్పారు. జైలు లోపల హోం మంత్రి పరిశీలిస్తున్న సమయంలో నర్మద బ్లాక్ వద్ద గంజాయి మొక్కను చూసి మంత్రి అవాక్కయ్యారు.