మహా కుంభమేళా 2025
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా (Mahakumbh 2025)కు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి 12 ఏళ్లకు ఒకసారి ఈ మహా కుంభమేళాను నిర్వహిస్తున్నారు. ఈ సారి 2025 జనవరి 13 తేదీ నుంచి ఫిబ్రవరి 26 వరకు ఈ మహా కుంభమేళా నిర్వహించనున్నారు. కోట్లాది మంది యాత్రికులు దేశ నలుమూలల నుంచి ప్రయాగ్ రాజ్‌కు తరలిరానున్నారు. ఈ సారి కుంభమేళాలో దాదాపు 45 కోట్ల మంది యాత్రికులు పాల్గొంటారని అంచనావేస్తున్నారు. ఆ మేరకు యాత్రికులు, సాధువుల కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
మహా కుంభమేళా దేశ ఐక్యతా మహాయజ్ఞంగా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. మహా కుంభమేళాలో కుల, వర్గ వైషమ్యాలు నశించిపోతాయని అన్నారు. కోట్లాది మంది ఒకే భావజాలంతో ముడిపడేందుకు కుంభమేళా దోహదపడుతుందన్నారు.