AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Monalisa Bhosle: పూసలమ్ముకునే మోనాలిసా ఇప్పుడెలా మారిపోయిందా చూశారా? నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా?

మహా కుంభమేళా లో రోడ్డు మీద పూసలమ్ముతూ కెమెరాల కంటికి చిక్కింది మోనాలిసా. అంతే రాత్రికి రాత్రే ఫేమస్ అయ్యింది. నెట్టింట సెన్సేషన్ అయ్యింది. ఓ ప్రముఖ దర్శకుడు ఆమెతో ఏకంగా సినిమా కూడా అనౌన్స్ చేశాడు. దీంతో ఇప్పుడామె స్టార్ సెలబ్రిటీగా మారిపోయింది.

Monalisa Bhosle: పూసలమ్ముకునే మోనాలిసా ఇప్పుడెలా మారిపోయిందా చూశారా? నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Monalisa Bhosle
Basha Shek
|

Updated on: Aug 22, 2025 | 7:42 PM

Share

మహాకుంభ్ లో పూల దండలు అమ్మిన మోనాలిసా తన అందంతో రాత్రికి రాత్రే ఫేమస్ అయింది. ఆ సమయంలో కొందరు ఫొటో గ్రాఫర్లు తీసిన మోనాలిసా వీడియోలు, ఫొటోలు నెట్టింట బాగా వైరల్ అయ్యాయి. ఒకప్పుడు రోడ్డు మీద పూసల దండలమ్ముతూ పేదరికంలో జీవించిన మోనాలిసా జాతకం ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. మ్యూజిక్ వీడియోలు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌ల ద్వారా బాగా సంపాదిస్తోంది. ఇక సోషల్ మీడియాలోనూ మోనాలిసా యాక్టివ్ గా ఉంటోంది. తరచూ తన ఫొటోలు, వీడియోలను అందులో షేర్ చేస్తోంది. దీంతో నెట్టింట ఈ ముద్దుగుమ్మకు రోజు రోజుకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోతోంది. మోనాలిసా తొలి మ్యూజిక్ వీడియో ఇటీవలే విడుదలైంది. ఇందులో ఆమె నటుడు ఉత్కర్ష్ సింగ్ మోనాలిసాతో కలిసి నటించింది. ఈ పాట విడుదలైన కొన్ని గంటల్లోనే సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఇక మ్యూజిక్ వీడియో హిట్ అయిన తర్వాత మోనాలిసా బ్రాండ్ ప్రమోషన్‌లోకి కూడా అడుగుపెట్టింది. ఇప్పుడీ అందాల తార పలు బ్రాండ్లకు ప్రమోషన్లు కూడా చేస్తోంది. ఇందుకు గానూ ఒక్కో యాడ్ కోసం లక్షల రూపాయలు తీసుకుంటోందని సమాచారం.

ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో మోనాలిసా తన ఆదాయం గురించి ఇలా చెప్పుకొచ్చింది. ‘మహాకుంభమేళా, గంగమ్మ తల్లి దయతో నాకు కొంచెం డబ్బు వస్తోంది. అంతేకానీ చాలా మంది అనుకుంటున్నట్లు నేను కోట్లు సంపాదించడం లేదు. కాగా ఇప్పుడు మోనాలిసా అందం గురించి ప్రతి చోటా చర్చ జరుగుతోంది. ఆమె ఇంటర్వ్యూకి సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్లు మోనాలిసా కష్టపడి పనిచేసే అమ్మాయి అని ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా ఇప్పుడు మోనాలిసా సినిమా ప్రాజెక్ట్ కోసం ఆమె అభిమానులు ఎదురు చూస్తున్నారు. దర్శకుడు సనోజ్ మిశ్రా తెరకెక్కిస్తోన్న ‘ది డైరీ ఆఫ్ మణిపూర్’ చిత్రంతో మోనాలిసా త్వరలో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టనుంది. దీంతో పాటు కొన్ని ఓటీటీ సంస్థలు కూడా తమ ఒరిజినల్స్, వెబ్ సిరీస్ ల కోసం ఆమెను సంప్రదించినట్లు సమాచారం.

మోనాలిసా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. ఇన్ స్టా గ్రామ్ లో నిత్యం తన ఫోటోలు మరియు వీడియోలను పోస్ట్ చేస్తుంది. దీంతో రోజు రోజుకూ ఈ ముద్దుగుమ్మ ఫ్యాన్ ఫాలోయింగ్ అమాంతం పెరుగుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్