AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chiranjeevi: అందుకే ఆయన స్థాయి వేరు.. స్థానం వేరు.. ఆ స్టార్ హీరో అప్పులన్నీ తీర్చేసిన మెగాస్టార్ చిరంజీవి..

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి కోట్లాది మంది అభిమానులున్నారు. అయితే వీరందరూ చిరంజీవి నటించిన సినిమాలు చూసి మాత్రమే ఫ్యాన్స్ కాలేదు.. మానవతా దృక్పథంతో ఆయన చేస్తోన్నఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలను చూసి అభిమానులుగా మారారు. సామాన్యులకే కాదు తోటి నటీనటులకు సాయం చేయడంలో మెగాస్టార్ ముందుంటారు.

Chiranjeevi: అందుకే ఆయన స్థాయి వేరు.. స్థానం వేరు.. ఆ స్టార్ హీరో అప్పులన్నీ తీర్చేసిన మెగాస్టార్ చిరంజీవి..
Chiranjeevi
Basha Shek
|

Updated on: Aug 21, 2025 | 9:19 PM

Share

మెగాస్టార్‌ చిరంజీవి బర్త్‌డేను అభిమానులు ఓ పండగలా సెలబ్రేట్ చేసుకుంటారు. రక్తదానం, అన్నదానం వంటి ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఇప్పటికే చాలా చోట్ల మెగాస్టార్ బర్త్ డే సెలబ్రేషన్స్ ప్రారంభమయ్యాయి. మరోవైపు దర్శక నిర్మాతలు చిరంజీవి సినిమాలకు సంబంధించి వరుసగా అప్డేట్స్ ఇస్తున్నారు. కొద్ది సేపటి క్రితమే విశ్వంభర గ్లింప్స్ రిలీజ్ అయ్యింది. ఇక శుక్రవారం (ఆగస్టు 22) అనిల్ రావిపూడి మెగా 157 టైటిల్ తో పాటు గ్లింప్స్ కూడా రిలీజ్ కానుందని టాక్ నడుస్తోంది. అలాగే వాల్తేరు వీరయ్య దర్శకుడు కే.ఎస్.రవీంద్ర తో మరో మూవీ అనౌన్స్ మెంట్ కూడా ఉంటుందని తెలుస్తోంది. ఇక ఇప్పటికే సోషల్ మీడియాలో మెగాస్టార్ చిరంజీవి పేరు తెగ మార్మోగిపోతోంది. ఆయన పుట్టిన రోజు పోస్టులు తెగ వైరల్ అవుతున్నాయి. ఇదే క్రమంలో చిరంజీవి చేసిన సేవా కార్యక్రమాలను కూడా మెగా ఫ్యాన్స్ గుర్తు తెచ్చుకుంటున్నారు. ఈ సందర్భంగా గతంలో ప్రముఖ నటుడు శరత్‌ కుమార్‌ కష్టాల్లో ఉన్నప్పుడు చిరంజీవి ఏ విధంగా సాయం చేశారో స్వయంగా ఆయన చెప్పిన పాత వీడియోని మెగా ఫ్యాన్స్ బాగా వైరల్ చేస్తున్నారు

‘ఒకానొక టైమ్‌లో నా సినిమా కెరీర్‌లో డౌన్ ఫాల్ అయ్యాను. అప్పులు బాగా పెరిగిపోయాయి. ఆ సమయంలో ఒక నిర్మాత నా దగ్గరకు వచ్చి చిరంజీవిగారి డేట్స్ తీసుకొస్తే.. ఆయనతో సినిమా తీసి వచ్చిన లాభాలతో మీ అప్పులు తీర్చుకునేలా సహాయం చేస్తానని మాటిచ్చారు. అప్పుడు నాకు వేరే మార్గం కనిపించలేదు. వెంటనే చిరంజీవిగారికి ఫోన్ చేశాను. ‘ మీతో పర్సనల్‌గా మాట్లాడాలని అన్నాను. వెంటనే ఆయన సినిమా చేస్తున్న సెట్‌కి వెళ్లాను. అప్పుడు ఓ ఫైట్ సీక్వెన్స్ షూట్ లో చిరంజీవి చిత్ర దర్శకనిర్మాతలను పిలిచి ‘ఈ షూట్ మళ్లీ పెట్టుకుందాం.. శరత్ వచ్చాడు మాట్లాడాలి’ అని నా దగ్గరకు వచ్చేశారు. నాకు ప్రేమగా వడ్డించి, భోజనం చేసిన తర్వాత విషయం ఏమిటో చెప్పమని అడిగారు’

ఇవి కూడా చదవండి

‘నీ డేట్స్ కావాలని చెప్పి.. ఆ నిర్మాత చెప్పిన విషయమంతా చిరుకి చెప్పాను. వెంటనే ఆయన ప్రస్తుతం నేను చేస్తున్న మూవీ కంప్లీట్ అవ్వగానే నీకే డేట్స్ ఇస్తాను. అన్ని ఏర్పాట్లు చేసుకోమన్నారు. మరి పారితోషికం ఎంత ఇవ్వమంటావ్? అని అడిగాను. ‘నువ్వు నాకు రెమ్యూనరేషన్ ఇస్తావారా? అని కోపంగా అన్నారు. కష్టాల్లో ఉన్నానని చెప్పావ్‌గా.. నాకు పారితోషకమేమీ వద్దు.. నీకు డేట్స్ ఇస్తున్నాను.. అంతే’ అని చెప్పి నన్ను పంపించారు’ అని ఈ వీడియోలో చెప్పుకొచ్చారు శరత్‌ కుమార్‌. ప్రస్తుతం ఈ పాత వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. చిరంజీవి గొప్పతనానికి మరో నిదర్శనమంటూ అభిమానులు స్పందిస్తున్నారు.

కూతురుతో నటుడు శరత్ కుమార్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..