AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: అమ్మాయిలను మాయం చేసే మర్రి చెట్టు.. ఓటీటీలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. ఒంటిరిగా చూడొద్దు

ప్రస్తుతం ఓటీటీలో ట్రెండింగ్ లో ఉన్న సినిమాలన్నీ హారర్ థ్రిల్లర్లే. ఇతర జానర్ సినిమాలకంటే వీటిని చూసేందుకు ఆడియెన్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ఓటీటీ సంస్థలు కూడా ప్రతి వారం ఆసక్తికరమైన హారర్ థ్రిల్లర్ సినిమాలను స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నాయి.

OTT Movie: అమ్మాయిలను మాయం చేసే మర్రి చెట్టు.. ఓటీటీలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. ఒంటిరిగా చూడొద్దు
OTT Movie
Basha Shek
|

Updated on: Aug 20, 2025 | 9:29 PM

Share

భయమేస్తుందని హారర్ సినిమాలను చూడడం మానేస్తామా? అల్లు అర్జున్ నటించిన జులాయి సినిమాలోని డైలాగ్ ఇది. ఇప్పుడు ఈ మాట నిజమేననిపిస్తుంది. ఎందుకంటే ఈ మధ్యన జనాలు ఎక్కువగా హారర్ థ్రిల్లర్ సినిమాలనే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా ఓటీటీలో అయితే ఎగబడి చూస్తున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా కూడా హారర్ థ్రిల్లర్ జానర్ మూవీనే. తల్లీ కూతుళ్ల నేపథ్యంలో ఈ మూవీ సాగుగుంది. కథ విషయానికి వస్తే.. అంబిక భర్త శుభంకర్ అనూహ్యంగా చనిపోతాడు. దీంతో ఆమె జీవితం తలకిందులైపోతుంది. ఈ క్రమంలోనే అంబిక కొన్ని ఆస్తి వివాదాలను పరిష్కరించుకోవడానికి తన చిన్న కుమార్తె శ్వేత తో కలిసి చంద్రపూర్ అనే తన పూర్వీకుల గ్రామానికి వెళ్తుంది. అయితే ఈ ప్రయాణంలో ఆ ప్రాంతాన్ని చాలా సంవత్సరాలుగా ఒక అదృశ్య శక్తి వేధిస్తుంటుంది. ఈ క్రమంలో ఎంతో మంది అమ్మాయిలు అదృశ్యమయ్యారని అంబిక తెలుసుకుంటుంది. చివరకు తన కూతురికి కూడా అదే పరిస్థితి దాపరిస్తుంది. అమ్మాయికి మొదటి రుతుస్రావం అయిన తర్వాత ఆమె భయంకరమైన రాక్షసునికి లొంగిపోతుందని అంబిక తెలుసుకుంటుంది. ఆ రాక్షసుడి ఆత్మ ఒక పగతో నిండిన చెట్టులో ఉందని ఆమెకు అర్థమవుతుంది. మరి తన కుమార్తెను, అదృశ్యమైన ఇతర అమ్మాయిలను రక్షించడానికి ఆ తల్లి ఏం చేసింది? ఆ రాక్షసుడిని ఎలా అంతమొందించింది? తదితర ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే ఈ హారర్ థ్రిల్లర్ సినిమాను చూడాల్సిందే.

ఈ సినిమా పేరు మా. కాజోల్ ప్రధాన పాత్రలో నటించింది. తనూజ దేవ్‌గణ్‌, రోనిత్‌రాయ్‌, సుభద్ర సేన్‌గుప్త, ఇంద్రనీల్, జితిన్ జ్యోతి గులాటీ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. దేవగన్ పిక్చర్స్ బ్యానర్ పై అజయ్ దేవగన్, జ్యోతి శాంతా సుబ్బరాయన్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు. జూన్ 27న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ ఆడియెన్స్ ను బాగా భయ పెట్టింది. అలాగే కలెక్షన్లు కూడా భారీగానే వచ్చాయి. ఇప్పుడీ హారర్ థ్రిల్లర్ సుమారు రెండు నెలల తర్వాత ఓటీటీలోకి రానుంది. ఆగస్టు 22 నుంచి ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో ‘మా’ స్ట్రీమింగ్ కానుంది.  ఓటీటీ కాబట్టి హిందీతో పాటు తెలుగు వెర్షన్ లో కూడా ఈ మూవీ స్ట్రీమింగ్ కు వచ్చే అవకాశముంది.  హారర్ థ్రిల్లర్ జానర్ సినిమాలను ఇంట్రెస్ట్ గా చూసే వారికి మా సినిమా ఒక మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..