Akkineni Nagarjuna: తండ్రి ఏఎన్నార్ ఆఖరి కోరికను నెరవేర్చిన హీరో నాగార్జున.. అదేంటో తెలుసా?
మొన్నటి వరకు హీరోగా అభిమానులను మెప్పించిన అక్కినేని నాగార్జున ఇప్పుడు నెగెటివ్ రోల్స్ తోనూ అలరిస్తున్నారు. ఆయన విలన్ గా నటించిన లేటెస్ట్ సినిమా కూలీ. రజనీకాంత్ హీరోగా నటించిన ఈ సినిమాలో స్టైలిష్ విలన్ సైమన్ పాత్రలో అదరగొట్టేశారు నాగ్.

టాలీవుడ్ మన్మథుడు, కింగ్ నాగార్జున నటించిన తాజా చిత్రం కూలీ. లోకేశ్ కనగరాజ్ తెరకెకకించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ లో రజనీకాంత్ హీరోగా నటించాడు. స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా రిలీజైన ఈ సినిమాలో స్టైలిష్ విలన్ సైమన్ పాత్రలో నాగ్ నటన అభిమానలను బాగా మెప్పించింది. ప్రస్తుతం కూలీ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకెళుతోంది. భారీ వసూళ్లు రాబడుతూ నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తోంది. రిలీజైన నాలుగు రోజుల్లోనే కూలీ సినిమాకు రూ. 400 కోట్లకు పైగానే వసూళ్లు వచ్చినట్లు ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. ఈ సినిమా సక్సెస ఆనందంలో ఉన్న నాగార్జున తాజాగా ఓ టాక్ షోకు హాజరయ్యాడు. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను అందులో పంచుకున్నాడు. మరీ ముఖ్యంగా తన తండ్రి దివంగత ఏఎన్నార్ ను గుర్తు చేసుకుని కాస్త ఎమోషనల్ అయ్యారు.
‘మనం సినిమా మాకు చాలా స్పెషల్. ఎందుకంటే నాన్న, నేను, చైతు, అఖిల్.. ఇలా ఫ్యామిలీ అంతా ఒకటే ఫ్రేమ్‌లో కనిపించాం. ఇది నాన్నగారి చివరి చిత్రమని మాకు షూటింగ్‌లోనే అర్థమైపోయింది. ఆయనకు క్యాన్సర్ రావడంతో అదే చివరి సినిమా అని మా అందరికీ తెలిసిపోయింది. అప్పటివరకు నాకు లైఫ్‌లో ఎలాంటి ఒత్తిడి లేదు.. కానీ రాత్రిళ్లు నిద్ర పోకుండా ఆలోచించింది మాత్రం ఈ ఒక్క మనం సినిమా గురించే. ఈ సినిమా షూటింగ్ సమయంలో నాన్న గారు ఒక మాట అన్నారు.. ‘ నాకు డబ్బింగ్ వేరేవాళ్లతో చెప్పిస్తే అస్సలు ఊరుకోను.. నేనే చెప్తా అన్నారు. దీంతో ఇంట్లో ఏర్పాటు చేసిన ఐసీయూ బెడ్ మీద నుంచే సినిమా డబ్బింగ్ మొత్తం పూర్తి చేశారు. ఆయన పాత్రకు తన సొంత వాయిస్‌తోనే డబ్బింగ్ చెప్పుకున్నారు. ఆ తర్వాత నాన్నకు సినిమా చూపిస్తే చాలా బాగుందిరా అన్నారు’ అని అప్పటి క్షణాలను గుర్తు చేసుకున్నారు నాగార్జున.
కూలీ సినిమా ఇంటర్వెల్ లో నాగార్జున్ హిట్ సాంగ్..
As Audience wish, we Screened #Nagarjuna‘s sir Iconic #SoniyaSoniya song on the Interval of #Coolir and the Audience was totally enjoyed☺️, it added a new vibe ❤️.
Book now and enjoy this kinda exclusive btw the Show.#coolieinsribalajicinemas@iamnagarjuna @chay_akkineni pic.twitter.com/7x1EARrCG0
— Sri Balaji Cinemas (@BalajiCinemas) August 17, 2025
నాగ్ స్టైల్ కు ఫిదా అవుతోన్న తమిళ్ ఆడియెన్స్..
#Nagarjuna ‘s Character Simon Attracted More Young Girls Than Boys .. Naga Has More Girl Fans Than His Both Sons !#Coolie pic.twitter.com/JB4ACoHTby
— TamilaninCinema Akilan (@TamilaninCinema) August 18, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








