AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: తండ్రి స్టార్ డైరెక్టర్.. భార్య స్టార్ హీరోయిన్.. ఈ టాలీవుడ్ హీరో ఇంట్లో అందరూ సినిమా సెలబ్రిటీలే

ఈ టాలీవుడ్ హీరో ఫ్యామిలీలో అందరూ సినిమా సెలబ్రిటీలే.. తండ్రేమో దిగ్గజ డైరెక్టర్.. పలువురు స్టార్ హీరోలతో సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కించాడు. ఇక సోదరుడు డైరెక్టర్ గానే కాకుండా అభిరుచిగల నిర్మాతగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఇతని భార్య, మరదలు కూడా స్టార్ హీరోయిన్లే.

Tollywood: తండ్రి స్టార్ డైరెక్టర్.. భార్య స్టార్ హీరోయిన్.. ఈ టాలీవుడ్ హీరో ఇంట్లో అందరూ సినిమా సెలబ్రిటీలే
Tollywood Actor
Basha Shek
|

Updated on: Aug 17, 2025 | 7:21 PM

Share

పై ఫొటోలో వీణ వాయిస్తోన్న పిల్లాడిని గుర్తు పట్టారా? అతను ఇప్పుడు టాలీవుడ్ లో ఫేమస్ యాక్టర్. తండ్రి దిగ్గజ డైరెక్టర్ అయినప్పటికీ స్వయంకృషితో నటుడిగా ఎదిగాడు. కెరీర్ ప్రారంభంలో చిన్న చితకా పాత్రలు పోషించాడు. తర్వాత హీరోగానూ మారి సక్సెస్ అయ్యాడు. దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో ఉన్న ట్యాలెంటెడ్ నటుల్లో ఇతను కూడా ఒకరు. అందుకే కేవలం హీరో పాత్రలే కాకుండా విలన్ గానూ, సహాయక నటుడిగానూ మెప్పిస్తున్నాడు. అయితే మధ్యన హీరోకు సరైన విజయాలు లేవు. అయినా తన ప్రయత్నాలు ఆపడం లేదు. మధ్యన ఒక డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్ తో మన ముందుకు వచ్చాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. సినిమాకు విమర్శకుల ప్రశంసలు వచ్చినా కమర్షియల్ గా విజయం సాధించలేకపోయింది. దీంతో ఇప్పుడతను ఒక పొలిటికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ తో ఆడియెన్స్ ను పలకరించాడు. ఇటీవలే ఓటీటీలోకి వచ్చిన సిరీస్ ఇప్పుడు రికార్డులు బద్దలు కొడుతోంది. దీంతో మరోసారి హీరో పేరు మార్మాగిపోతోంది. ఇంతకీ హీరో ఎవరో గుర్తు పట్టారా? తను మరెవరో కాదు మయసభ వెబ్ సిరీస్ కృష్ణమ నాయుడిగా నటించి మెప్పించిన హీరో ఆది పినిశెట్టి.

ఇవి కూడా చదవండి

సుమారు 50 కు పైగా సినిమాలు తెరకెక్కించిన రవి రాజా పినిశెట్టి కుమారుడే ఆది పినిశెట్టి. మెగాస్టార్ చిరంజీవితో యముడికి మొగుడు, మోహన్ బాబుతో పెదరాయుడు, వెంకటేష్‌తో చంటి, రాజశేఖర్ తో మా అన్నయ్య వంటి ఇండస్ట్రీ హిట్ సినిమాలను తెరకెక్కించారు రవిరాజా పినిశెట్టి. అయితే ప్రస్తుతం ఆయన సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ తన ఇద్దరు కుమారులు సినీ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. ఆది పినిశెట్టి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఇక రెండో కుమారుడు సత్య ప్రభాస్ కూడా మలుపు సినిమాతో డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు. అలాగే కొన్ని సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించాడు.

భార్య నిక్కీ గల్రానీతో ఆది పినిశెట్టి..

ఇక ఆదిపిని శెట్టి భార్య నిక్కీ గల్రానీ కన్నడలో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగింది. తెలుగులోనూ మలుపు, కృష్ణాష్టమి తదితర సినిమాల్లోనూ నటించింది. ఇక నిక్కీ సోదరి సంజనా గల్రానీ కూడా తెలుగు ఆడియెన్స్ కు పరిచయమే. దండుపాళ్యంతో సినిమాతో ఫేమస్ అయిన ముద్దుగుమ్మ తెలుగులో బుజ్జిగాడు సినిమాలో సెకెండ్ హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే.

ఆది పినిశెట్టి ఫ్యామిలీ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

రూ.500 కోట్లు వచ్చినా సేఫ్ కాదా.. ఇదెక్కడి బిజినెస్
రూ.500 కోట్లు వచ్చినా సేఫ్ కాదా.. ఇదెక్కడి బిజినెస్
తన పెళ్లి పై 12రోజుల తర్వాత మౌనం వీడిన స్మృతి మంధాన
తన పెళ్లి పై 12రోజుల తర్వాత మౌనం వీడిన స్మృతి మంధాన
ఎన్టీఆర్ సినిమాపై మైండ్ బ్లోయింగ్ అప్‌డేట్..
ఎన్టీఆర్ సినిమాపై మైండ్ బ్లోయింగ్ అప్‌డేట్..
రాష్ట్రపతి విందుకు రాహుల్‌కు అందని ఆహ్వానం..కాంగ్రెస్ నుంచి ఆయనకు మాత్రమే..
రాష్ట్రపతి విందుకు రాహుల్‌కు అందని ఆహ్వానం..కాంగ్రెస్ నుంచి ఆయనకు మాత్రమే..
ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌తో హీరోయిన్లకు తిప్పలు
ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌తో హీరోయిన్లకు తిప్పలు
కదలికతోనే కోట్లు కురిపించనున్న రాహు కేతువులు.. మీ రాశి ఉందా?
కదలికతోనే కోట్లు కురిపించనున్న రాహు కేతువులు.. మీ రాశి ఉందా?
8 గంటలు పని చేయడానికి ఇదేమైనా జాబా.. ఇచ్చి పడేసిన రానా
8 గంటలు పని చేయడానికి ఇదేమైనా జాబా.. ఇచ్చి పడేసిన రానా
వారి కాలి స్పర్శ తగిలితే దీర్ఘకాలిక రోగాలు నయమవుతాయట..
వారి కాలి స్పర్శ తగిలితే దీర్ఘకాలిక రోగాలు నయమవుతాయట..
రోజూ రాత్రి 2 యాలకులు తింటే.. మీ శరీరానికి సూపర్ పవర్స్..!
రోజూ రాత్రి 2 యాలకులు తింటే.. మీ శరీరానికి సూపర్ పవర్స్..!
ఈ ఫొటోలో దాగి ఉన్న పిల్లిని గుర్తిస్తే.. నిన్ను మించిన తోపుల్లేరు
ఈ ఫొటోలో దాగి ఉన్న పిల్లిని గుర్తిస్తే.. నిన్ను మించిన తోపుల్లేరు