Tollywood: షాకింగ్.. విడాకుల బాటలో మరో స్టార్ కపుల్! హీరోపై గృహ హింస కేసు పెట్టిన భార్య
సమంత- నాగ చైతన్య,ధనుష్- ఐశ్వర్య, జయం రవి- ఆర్తి, జీవీ ప్రకాశ్- సైంధవి.. ఇలా సినిమా ఇండస్ట్రీలో విడాకుల పర్వం కొనసాగుతోంది. యాపిల్ బ్యూటీ హన్సిక కూడా తన భర్తతో విడిపోనుందని వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు మరో స్టార్ కపుల్ విడిపోయేందుకు రెడీగా ఉన్నారని టాక్.

ప్రముఖ కన్నడ హీరో అజయ్ రావుపై ఆయన భార్య స్వప్న గృహ హింస కేసు దాఖలు చేయడం సినిమా ఇండస్ట్రీలో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. గత కొన్ని రోజులుగా వీరిద్దరూ విడిపోనున్నారని, విడాకులు తీసుకోనున్నారని ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలనే స్వప్న తన భర్తపై గృహ హింస కేసు పెట్టడం ఈ విడాకుల రూమర్లకు మరింత బలాన్నిచ్చింది. అయితే తన భర్తపై ఫిర్యాదు చేసిన తర్వాత స్వప్న తన ప్రకటనను సోషల్ మీడియాలో కుంది. ‘ఒక తల్లిగా, నా మొదటి బాధ్యత నా కుమార్తె భద్రత, గౌరవం అలాగే ఆమె భవిష్యత్తు. నన్ను తీవ్రంగా పరీక్షిస్తున్న సవాళ్లను ఎదుర్కొంటూ నేను ప్రతిరోజూ ధైర్యాన్ని కూడగట్టుకుంటున్నాను. ప్రియమైన మిత్రులారా, సోదరులారా, నా కుమార్తె నేను మా జీవితాలను పునర్మించుకుంటున్నాం. ఈ విషయం మా వ్యక్తిగత, సన్నిహిత, భావోద్వేగాలకు సంబంధించినది. దయచేసి ఈ విషయంలో మాకు గోప్యత కావాలని కోరుకుంటున్నాం. దయచేసి మా ఫ్యామిలీ విషయాలను పబ్లిసిటీ చేయొద్దు. అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను అని రాసుకొచ్చింది స్వప్న. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయమేమటంటే. తన పోస్ట్ చివరలో ఆమె తన పేరును స్వప్నా అజయ్ రావు అని పేర్కొంది. అంటే తనకు విడాకులు తీసుకునే ఉద్దేశ్యం లేదని పరోక్షంగా తెలియజేసింది. ఆమె ఈ పోస్ట్‌ను కన్నడతో పాటు ఇంగ్లిష్ భాషల్లో పోస్ట్ చేసింది.
ఇక నిన్న ఇదే విషయంపై స్పందించిన నటుడు అజయ్ రావు, “ఈ సున్నితమైన సమయంలో, మా కుటుంబ గోప్యతను గౌరవించాల, వ్యక్తిగత విషయాలకు సంబంధించిన ఏవైనా వార్తలను పబ్లిసిటీ చేయవద్దని అభ్యర్థిస్తున్నాం. ప్రతి కుటుంబం సమస్యలు, ఇబ్బందులు ఉంటాయి. ఈ విషయంలో అందరూ మా గోప్యతకు ప్రాధాన్యమివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా భార్య కోర్టుకు వెళ్లిందా? ఏమో, నాకైతే తెలియదు. ఈ విషయం గురించి నా భార్యతో మాట్లాడతాను’ అని ఇన్ స్టా గ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టాడు.
అజయ్ రావు, స్వప్న డిసెంబర్ 2014లో వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు చరిష్మ అనే కుమార్తె ఉంది. స్వప్న ఒక ఐటీ కంపెనీలో ఉద్యోగి. అజయ్ రావు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. తన భర్త సినిమాల గురించి కూడా మాట్లాడింది లేదు. సినిమా ఈవెంట్లకు కూడా దూరంగా ఉంటోంది. అలాంటిది ఆమె ఇప్పుడు తన భర్తపై గృహ హింస కేసు పెట్టడం తీవ్ర చర్చనీయాంశమైంది.
కూతురు బర్త్ డే వేడుకల్లో అజయ్ రావు- స్వప్న దంపతులు..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








