AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maanas Nagulapalli: కొత్తిల్లు కొన్న ‘బ్రహ్మముడి’ నటుడు మానస్.. వేడుకగా గృహ్ర ప్రవేశం.. వీడియో ఇదిగో

ఛైల్డ్ ఆర్టిస్టుగా పలు సినిమాల్లో నటించాడు మానస్. ఆ తర్వాత హీరోగానూ అదృష్టం పరీక్షించుకున్నాడు. బిగ్ బాస్ షోలోనూ సందడి చేశాడు. ఇక బ్రహ్మముడి సీరియల్ తో బుల్లితెరపై స్టార్ నటుడిగా మారిపోయడు. ఇప్పుడు సూపర్ హిట్ కామెడీ షో జబర్దస్త్ కు యాంకర్ గానూ అలరిస్తున్నాడు.

Maanas Nagulapalli: కొత్తిల్లు కొన్న 'బ్రహ్మముడి' నటుడు మానస్.. వేడుకగా గృహ్ర ప్రవేశం.. వీడియో ఇదిగో
Maanas Nagulapalli
Basha Shek
|

Updated on: Aug 18, 2025 | 4:48 PM

Share

సూపర్ హిట్ సీరియల్ బ్రహ్మముడి తో ఒక్కసారిగా పాపులర్ అయ్యాడు మానస్ నాగులపల్లి. ఇందులో రాజ్ గా అతని అభినయం అందరినీ ఆకట్టుకుంది. అంతకు ముందు చాలా సినిమాలు, సిరీసుల్లో హీరోగా, సహాయక నటుడిగా యాక్ట్ చేశాడు. బిగ్ బాస్ ఐదో సీజన్ లోనూ మెరిశాడు. కానీ బ్రహ్మముడి సీరియల్ తోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవలే జబర్దస్త్ యాంకర్ గానూ బాధ్యతలు స్వీకరించాడీ హ్యాండ్సమ్ యాక్టర్. మొత్తానికి టీవీ షోస్, ప్రోగ్రామ్స్, ఈవెంట్స్ తో రెండు చేతులా సంపాదిస్తున్నాడు మానస్. ఈ క్రమంలోనే అతను కొత్త ఇల్లు కొనుగోలు చేశాడు. హైదరాబాద్‌ ఎస్‌ఆర్‌ నగర్‌లో ఓ ఫ్లాట్ ను కొన్న మానస్ తాజాగా గృహ ప్రవేశం కూడా చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను మానస్‌ తల్లి పద్మిని సోషల్‌ మీడియాలో ఓ వీడియో షేర్‌ చేసింది. డ్రీమ్‌ హౌస్‌ కల నెరవేరిందని తెలిపింది. భర్త ఎన్‌వీ రావు, కుమారుడు మానస్‌, కోడలు శ్రీజ, మనవడు ధ్రువతో కలిసి గృహప్రవేశం చేసినట్లు ఆమె తెలిపింది. ఈ వేడుకలో మానస్ కుటుంబ సభ్యులతో పాటు అతి కొద్ది మంది స్నేహితులు, సన్నిహితులు మాత్రమే పాల్గొన్నారు. కాగా  మానస్‌ 2023లో ‍శ్రీజను పెళ్లి చేసుకున్నాడు. వీరికి గతేడాది కుమారుడు ధ్రువ జన్మించాడు.

నరసింహ నాయుడు, వీడే, అర్జున్ తదితర చిత్రాల్లో బాలనటుడిగా మెప్పించాడు. ఆ తర్వాత 2011లో ‘ఝలక్’ సినిమాతో హీరోగా మారాడు. గ్రీన్ సిగ్నల్, కాయ్ రాజా కాయ్, గోలీ సోడా, ప్రేమికుడు, క్షీరసాగర మథనం సినిమాలతో అలరించాడు. ఆ తర్వాత బిగ్‌బాస్ తెలుగు 5వ సీజన్‌లో పాల్గొని గ్రాండ్ ఫినాలే వరకు వచ్చాడు. ఇక ఈ షో నుంచి బయటకు రాగానే కోయిలమ్మ, బ్రహ్మముడి సీరియల్స్ తో బుల్లితెర ఆడియెన్స్ ను పలకరించాడు. ఇప్పుడు పలు సీరియల్స్ తో పాటు జబర్దస్త్ షోకు యాంకర్ గానూ వ్యవహరిస్తున్నాడు.

ఇవి కూడా చదవండి

గృహ ప్రవేశం వేడుకలో మానస్ కుటుంబ సభ్యులు..

భార్య శ్రీజతో మానస్..

భార్య, కుమారుడితో బ్రహ్మ ముడి నటుడు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్..అవార్డులన్నీ గురుగ్రాంకు పార్సిల్
కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్..అవార్డులన్నీ గురుగ్రాంకు పార్సిల్
మన శంకరవరప్రసాద్ గారు సినిమా పబ్లిక్ టాక్..
మన శంకరవరప్రసాద్ గారు సినిమా పబ్లిక్ టాక్..
ఆపరేషన్‌ 2.0.. ఆ ఎన్నికలే టార్గెట్‌గా తెలంగాణపై జనసేక ఫోకస్
ఆపరేషన్‌ 2.0.. ఆ ఎన్నికలే టార్గెట్‌గా తెలంగాణపై జనసేక ఫోకస్
ఆర్డర్ చేయకుండానే ఇంటికొచ్చిన పార్శిల్.. ఓపెన్ చేసి..
ఆర్డర్ చేయకుండానే ఇంటికొచ్చిన పార్శిల్.. ఓపెన్ చేసి..
ఈ ట్రైన్‌లో వెయిటింగ్ సౌకర్యం ఉండదు.. కనీస ఛార్జ్‌ ఎంత ఉంతంటే..
ఈ ట్రైన్‌లో వెయిటింగ్ సౌకర్యం ఉండదు.. కనీస ఛార్జ్‌ ఎంత ఉంతంటే..
మకరజ్యోతి దర్శనానికి సర్వం సిద్ధం.. కేవలం వారికి మాత్రమే అనుమతి
మకరజ్యోతి దర్శనానికి సర్వం సిద్ధం.. కేవలం వారికి మాత్రమే అనుమతి
ఒకే మ్యాచ్‌లో 414 పరుగులు..ఢిల్లీ కోటను కూల్చిన సోఫీ
ఒకే మ్యాచ్‌లో 414 పరుగులు..ఢిల్లీ కోటను కూల్చిన సోఫీ
విద్యార్థులకు తెలంగాణ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్
విద్యార్థులకు తెలంగాణ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్
7 వైడ్లు, 4 నోబాల్స్.! పిల్లబచ్చా జట్టుపై 17 బంతులు ఓవర్‌..
7 వైడ్లు, 4 నోబాల్స్.! పిల్లబచ్చా జట్టుపై 17 బంతులు ఓవర్‌..
వడోదరలో విరాట్ విధ్వంసం..సెంచరీ మిస్సైనా రికార్డుల పంచ్ అదిరింది
వడోదరలో విరాట్ విధ్వంసం..సెంచరీ మిస్సైనా రికార్డుల పంచ్ అదిరింది