AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shriya Saran: కొండాపూర్‌లో జెన్నారా క్లినిక్స్ ప్రారంభించిన నటి శ్రియా శరణ్..

కొండాపూర్‌లో ప్రారంభించింది కేవలం ఒక కొత్త బ్రాంచ్ కాదు, ఇది ఒక మైలురాయి. ఇది మా ఎదుగుదల, పట్టుదల, ప్రపంచస్థాయి డెర్మటాలజీని మరింత అందుబాటులోకి తీసుకురావాలన్న మా నిబద్ధతకు చిహ్నం. జెన్నారా లక్ష్యం ప్రజల హృదయాలకు చేరుకుంటోందని ఇది రుజువు చేస్తుంది అన్నారు జెన్నారా క్లినిక్స్ డైరెక్టర్ ప్రియాంక రెడ్డి ముత్యాల.

Shriya Saran: కొండాపూర్‌లో జెన్నారా క్లినిక్స్ ప్రారంభించిన నటి శ్రియా శరణ్..
Shriya Saran
Rajitha Chanti
|

Updated on: Aug 21, 2025 | 9:02 PM

Share

చర్మ సంరక్షణ, సౌందర్య చికిత్సలను మరింత అందుబాటులోకి తీసుకురావడంలో తమ ప్రయాణంలో మరో ముఖ్యమైన మైలురాయిని జెన్నారా క్లినిక్స్ చేరుకుంది. తమ సరికొత్త బ్రాంచ్‌ను కొండాపూర్‌లో ప్రారంభించినట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఈ ప్రారంభోత్సవానికి ప్రముఖ భారతీయ నటి శ్రీయా శరణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకకు ఆమె రాక బ్రాండ్ పట్ల పెరుగుతున్న అభిమానాన్ని, ప్రజలు ఆత్మవిశ్వాసం, శ్రద్ధకు ఇస్తున్న ప్రాధాన్యతను ప్రతిబింబించింది. ప్రపంచస్థాయి వైద్య నైపుణ్యం, అత్యాధునిక సాంకేతికతను మేళవించి, జెన్నారా క్లినిక్స్ హైదరాబాద్‌లో చర్మ, వెంట్రుకల సంరక్షణలో అత్యంత విశ్వసనీయమైన క్లినిక్స్‌లో ఒకటిగా ఎదిగింది.

జెన్నారా ఎదుగుదల వెనుక బలమైన నాయకత్వ బృందం ఉంది. ఈ బృందంలో శ్రీ గోకుల్ కృష్ణ వంకాయలపాటి, శ్రీమతి కంచర్ల నాగ లక్ష్మి రెడ్డి, శ్రీమతి ప్రియాంక రెడ్డి ముత్యాల, శ్రీ అధిప్ అయ్యర్, శ్రీమతి ఇసుకపట్ల మహేశ్వరి ఉన్నారు. వీరంతా క్లినికల్ ఎక్సలెన్స్‌తో పాటు రోగుల ఆత్మవిశ్వాసం, సంరక్షణపై పూర్తి దృష్టి సారించే జెన్నారా తత్వాన్ని రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు.

కొండాపూర్‌లోని బృందంలో అంతర్జాతీయంగా శిక్షణ పొందిన డెర్మటాలజిస్టులు, సౌందర్య నిపుణులు ఉన్నారు. వీరు చికిత్సలు సురక్షితంగా, ప్రభావవంతంగా ఉండేలా తమ ప్రత్యేక నైపుణ్యాన్ని అందిస్తారు. ఈ క్లినిక్ కొండాపూర్ నివాసితులు, నిపుణుల అవసరాలకు అనుగుణంగా వ్యూహాత్మకంగా నెలకొల్పారు. పొడిగించిన పని వేళలు, సౌకర్యవంతమైన అపాయింట్‌మెంట్ విధానాలు ఇక్కడ ఉంటాయి. ఇది వైద్య నైపుణ్యాన్ని స్పా లాంటి ప్రశాంత వాతావరణంతో కలిపి, రోగులు ఆనందంగా, సౌకర్యంగా ఉండేలా చూసే జెన్నారా తత్వాన్ని ప్రతిబింబిస్తుంది.