Tollywood: ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు బిజినెస్‌లో రారాజు.. దేశంలోనే అతి పెద్ద జ్యూయెలరీ మాల్ ఓనర్
తండ్రి స్టార్ నటుడు కమ్ డైరెక్టర్ కావడంతో చిన్న వయసులోనే సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. అనతికాలంలోనే హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా దక్షిణాదిలో ప్రేమకథా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయాడీ హ్యాండ్సమ్ హీరో. అయితే ఇప్పుడు మాత్రం..

దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్న మాట సినిమా స్టార్లకు బాగా సరిపోతుంది. అందుకే ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు బిజినెస్ లో దూసుకుపోతున్నారు. వివిధ వ్యాపారాలు చేస్తూ కోట్లు గడిస్తున్నారు. ఈ టాలీవుడ్ హీరో కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతాడు. సినిమా ఛాన్సులు తగ్గినా బిజినెస్ లో రయ్ రయ్ మంటూ దూసుకుపోతున్నాడు. స్టార్ నటుడి వారసుడిగా 17 ఏళ్లకే సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడీ హ్యాండ్సమ్ యాక్టర్. ప్రేమకథా చిత్రాలు, రొమాంటిక్ మూవీస్ తో యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. అదే సమయంలో దర్శక దిగ్గజాలుగా పేరున్న మణిరత్నం, శంకర్ సినిమాల్లోనూ హీరోగా నటించి మెప్పించాడు. పలు సూపర్ హిట్ సినిమాలతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. అప్పట్లో ఈ హీరో జోరు చూస్తే సినిమా ఇండస్ట్రీని ఏలుతాడని భావించారు. కానీ ఈ హీరో క్రమంగా తన క్రేజ్ కోల్పోయాడు. వరుసగా పరాజయాలు ఎదుర్కొన్నాడు. దీనికి తోడు పర్సనల్ లైఫ్ లోనూ ఒడిదొడకులు ఎదురయ్యాయి. భార్యతో విడాకులు తీసుకుని విడిపోయాడు. దీంతో చాలా రోజుల పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నాడు. అయితే గోడకు కొట్టిన బంతిలా మళ్లీ తిరిగొచ్చాడు. హీరోగా సినిమాలు తీస్తూనే మరోవైపు సహాయక నటుడిగానూ హిట్స్ కొట్టాడు. మరోవైపు బిజినెస్ లో జెడ్ స్పీడ్ లో దూసుకెళ్లిపోయాడు. ఇప్పుడు ఏకంగా దేశంలోనే అతిపెద్ద జ్యూయెలరీ మాల్ ఓనర్ గా ఉన్నాడీ హ్యాండ్సమ్ నటుడు. ఇంతకీ అతనెవరు అనుకుంటున్నారా? జీన్స్ హీరో ప్రశాంత్.
కొన్నేళ్ల క్రితం చెన్నైలోని పానగల్ పార్క్ లో ప్రశాంత్ రియాల్ గోల్డ్ టవర్ పేరుతో ఓ విశాలమైన జ్యూయెలరీ మాల్ ను కట్టించాడు ప్రశాంత్. దాదాపు 10 అంతస్తులతో సుమారు 1.7 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ బిల్డింగ్ ఉంది. ప్రస్తుతం దేశంలోని బ్రాండెడ్ నగలకు ప్రశాంత్ రియాల్ గోల్డ్ టవర్ నిలయంగా ఉంది. అంతేకాదు ఈ బిల్డింగ్ లో విశాలమైన ఫుడ్ కోర్ట్, ఏటీఎంలు, పార్కింగ్ సౌకర్యం కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ జ్యూయెలరీ మాల్ నిర్వహణలో ప్రశాంత్ సోదరి, నగల డిజైనర్ ప్రీతి త్యాగరాజన్ ప్రధాన పాత్ర పోషిస్తోంది.
నటుడు ప్రశాంత్ ఇన్ స్టాగ్రామ్ వీడియో..
View this post on Instagram
కాగా అంధాదూన్ రీమేక్ తో హీరోగా రీ ఎంట్రీ ఇచ్చాడు ప్రశాంత్. ఆ తర్వాత దళపతి విజయ్ హీరోగా నటించిన గోట్ లో ఓ కీలక పాత్ర పోషించాడు. ప్రస్తుతం ప్రశాంత్ హీరోగానూ, సహాయక నటుడిగానూ కొన్ని సినిమాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








