వైట్ డ్రెస్‌లో క్యూట్‌గా.. మెహ్రీన్ ఎంత బాగుందో కదా..
ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన అంద చందాలతో మాయచేసే ముద్దుగుమ్మల్లో అందాల చిన్నదీ మెహ్రీన్ ఫిర్జాదా ముందుంటుంది. ఈ బ్యూటీ ఈ మధ్య వరస ఫొటో షూట్‌తో కుర్రకారు మదిని దోచేస్తుంది. తాజాగా ఈ చిన్నది వైట్ కలర్ డ్రెస్‌లో తన అందాలతో మతిపొగొడుతుంది.
Updated on: Aug 21, 2025 | 2:59 PM

అందాల చిన్నది మెహ్రీన్ ఫిర్జాదా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందం, అభినయం ఈ బ్యూటీ సొంతం. స్టార్ హీరోయిన్స్‌కు మించిన అందం, మంచి నటనతో ఎంతో మంది మదిని దోచిన ఈ చిన్నది చాలా తక్కువ సమయంలోనే చిత్ర పరిశ్రమకు దూరమైందనే చెప్పాలి. ఈ బ్యూటీకి తెలుగులో ఆఫర్స్ రాకపోవడంతో ఆడపాదడపా సినిమాలు చేస్తూ కెరీర్ రన్ చేస్తుంది.

పంజాబ్‌లో పుట్టిన ఈ బ్యూటీ మోడలింగ్‌లో కెరీర్ స్టార్ట్ చేసి, 2016లో నాని సరసన కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీలో ఈ అమ్మడు నటన, గ్లామర్‌కు ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోయారు. ఈ బ్యూటీ స్టార్ హీరోయిన్‌గా సత్తా చాటుతుందని అనుకున్నారు. కానీ ఊహించినది జరగలేదనే చెప్పాలి.

ఈ మూవీ తర్వాత మెహ్రీన్ తెలుగులో మహానుభావుడు, రాజాది గ్రేట్, జవాన్, పంతం, కవచం, ఎఫ్2 ఎఫ్ 3, ఎంత మంచివాడవురా, లోకల్ బాయ్, అశ్వద్థామ, మంచి రోజులు వచ్చాయి వంటి చాలా సినిమాల్లో నటించి మెప్పించింది. అయినప్పటికీ ఈ ముద్దుగుమ్మకు అంతగా గుర్తింపు రాలేదనే చెప్పాలి. సినిమాల్లో అవకాశాలు వచ్చినప్పటికీ స్టార్ హీరోయిన్‌గా తన సత్తా చాటలేకపోయింది.

ఇక ఈ సినిమాల తర్వాత తెలుగులో అవకాశాలు తగ్గడంతో ఈ బ్యూటీకి ఫిల్లౌరీ అనే హిందీ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది.అక్కడ పలు సినిమాలు చేసి తన నటనతో అందరినీ ఆకట్టుకుంది. ఇక సినిమాల విషయం పక్కన పెడితే ఈ బ్యూటీ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన అంద చందాలతో మాయ చేస్తుంటుంది.

తాజాగా ఈ బ్యూటీ వైట్ కలర్ డ్రెస్‌లో తన అందాలతో కుర్రకారుకు విందు భోజనం పెట్టింది. ప్రస్తుతందీనికి సంబంధించిన ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతుండటంతో, క్యూట్, బ్యూటిఫుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఈ ముద్దుగుమ్మ అభిమానులు.



