- Telugu News Photo Gallery Cinema photos Peddi Movie Ram Charan New Village Drama Cast and Shooting Updates
Ram Charan: చరణ్ ఫ్యాన్స్ ఫిదా అయిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చిన బుచ్చిబాబు
పెద్ది సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చింది ఒక్క టీజర్ మాత్రమే కానీ.. దీనిపై అంచనాలు మాత్రం రోజు పెంచేస్తూనే ఉన్నారు దర్శకుడు బుచ్చిబాబు. దానికోసం ఆయన సపరేట్ ప్లానింగ్ సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా అభిమానులకు మరో సర్‌ప్రైజ్ ఇచ్చారు బుచ్చి. అది చూసి ఫిదా అయిపోయారు ఫ్యాన్స్. ఇంతకీ ఏంటా సర్‌ప్రైజ్..?
Updated on: Aug 20, 2025 | 5:03 PM

గేమ్ ఛేంజర్ ఫ్లాప్ అయ్యుండొచ్చు కానీ అందులో రామ్ చరణ్ నటనకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి. ముఖ్యంగా అప్పన్న పాత్రతో అద్భుతం చేసారు చరణ్. పెద్దిలో తన నట విశ్వరూపం చూపించాలని ఫిక్సయ్యారు మెగా వారసుడు.

రంగస్థలం తర్వాత మరోసారి పూర్తిస్థాయి విలేజ్ డ్రామాతో రాబోతున్నారు రామ్ చరణ్. పెద్ది షూటింగ్ మొన్నటి వరకు వేగంగానే జరిగింది.. సమ్మె కారణంగా కొన్ని రోజులుగా బ్రేక్ పడింది. దీన్ని ఎవరూ ఊహించని స్థాయిలో డిజైన్ చేస్తున్నారు బుచ్చిబాబు.

మరోవైపు రంగస్థలానికి మించి ఈ చిత్రం ఉంటుందని అభిమానులకు హామీ ఇస్తున్నారు చరణ్. ఇదిలా ఉంటే సినిమాలో చరణ్ లుక్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఈ సినిమా కోసం మరోసారి గడ్డం పెంచేసి.. డిఫెరెంట్ హెయిర్ స్టైల్ మెయింటేన్ చేస్తున్నారు చరణ్.

తాజాగా పెద్ది నిర్మాణ సంస్థల్లో ఒకరైన విృద్ధి సినిమాస్ చరణ్‌కు సంబంధించిన వీడియోను విడుదల చేసారు. అలా ఈ వీడియో రాగానే.. ఇలా క్షణాల్లో వైరల్ అయిపోయింది. అందులో చెర్రీ లుక్స్ మామూలుగా లేవు.. మరోసారి అయ్యప్ప మాలలో దర్శనమిచ్చారు చరణ్.

సినీ కార్మికుల సమ్మెకు ఓ పరిష్కారం దొరక్కానే పెద్ది మళ్లీ సెట్స్‌పైకి రానుంది. ఇప్పటికే 50 శాతం షూట్ పూర్తయింది. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో మీర్జాపూర్ ఫేమ్ దివ్యేందు కీలక పాత్ర చేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్, విృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా పెద్ది సినిమాను నిర్మిస్తున్నాయి.




