- Telugu News Photo Gallery Cinema photos Mrunal's Apology Body Shaming Controversy and Bipasha Basu's Response
Mrunal Thakur: తాను చేసిన తప్పును సరిదిద్దుకున్న మృణాల్.. ముద్దుగుమ్మ తీరుకు ఫ్యాన్స్ ఫిదా
అనడానికి ఏముంది? ఎవరైనా.. ఎప్పుడైనా నోరు జారి ఏదో ఒకటి అనేయవచ్చు. పొరపాటు దొర్లవచ్చు. కానీ తాను పొరపడ్డానని తెలుసుకుని దిద్దుకోవడంలోనే కదా ఉంటుంది గొప్పతనం. రీసెంట్‌గా బిపీసా విషయంలో జరిగిన ఓ పొరపాటును మృణాల్ దిద్దుకున్న తీరుకు ఫిదా అవుతున్నారు జనాలు. ఇంతకీ అలా ఏం జరిగింది?
Updated on: Aug 20, 2025 | 4:59 PM

అప్పుడెప్పుడో నా 19 ఏళ్లప్పుడు చెప్పిన విషయం... ఇంత గాయపరుస్తుందని అనుకోలేదని అంటున్నారు మృణాల్. ఇంటర్వ్యూలో సరదాగా మృణాల్ అన్న మాటలు రీసెంట్‌గా దుమారం రేపాయి.

బిపాసాను ఉద్దేశించి మృణాల్ చేసిన వ్యాఖ్యలు బాడీ షేమింగ్‌గా ఉన్నాయంటూ నెటిజన్లు విరుచుకుపడ్డారు. మృణాల్ మాటలకు హర్ట్ అయిన బిపాసా కూడా ఇన్ డైరక్ట్ గా రియాక్ట్ అయ్యారు.

శారీరకంగా దృఢంగా ఉండటానికి మహిళలు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదన్నారు. బిపాసా స్పందించిన తీరు కూడా క్షణాల్లో ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. ఇప్పుడు దాని గురించే రియాక్ట్ అయ్యారు మృణాల్.

చిన్నతనంలో తెలియక అలా మాట్లాడానని అన్నారు. ప్రతి కోణంలోనూ అందం ఉంటుందని నేనిప్పుడు నమ్ముతున్నా.ఏం మాట్లాడుతున్నానో అర్థం చేసుకోలేని ప్రాయం అది.

చాలా దూరం వచ్చింది.. మనసుల్ని గాయం చేసింది. అందుకు డీప్లీ సారీ.. అంటూ మృణాల్ పోస్ట్ చేశారు. మెచ్యూరిటీ అంటే ఇదేనని మెచ్చుకుంటున్నారు ఫ్యాన్స్.




