- Telugu News Photo Gallery Cinema photos Actress nivetha Pethuraj shared her latest black colour saree pics
Nivetha Pethuraj: నల్ల చీరలో కుర్రాళ్ళ గుండె గుల్ల చేస్తున్న నివేదా పేతురాజ్..
మోడల్ గా కెరీర్ ప్రారంభించిన నివేదా పేతురాజ్ ఆ తర్వాత హీరోయిన్ గా మారింది. ఈ చిన్నది 2016లో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఈ క్రమంలోనే.. తమిళ, తెలుగు చిత్రాలలో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఒరు నాల్ కూతు (2016) అనే తమిళ చిత్రంతో నివేదా పేతురాజ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.
Updated on: Aug 20, 2025 | 4:41 PM

మోడల్ గా కెరీర్ ప్రారంభించిన నివేదా పేతురాజ్ ఆ తర్వాత హీరోయిన్ గా మారింది. ఈ చిన్నది 2016లో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఈ క్రమంలోనే.. తమిళ, తెలుగు చిత్రాలలో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఒరు నాల్ కూతు (2016) అనే తమిళ చిత్రంతో నివేదా పేతురాజ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆతర్వాత తెలుగులో మెంటల్ మదిలో చిత్రంతో అరంగ్రేట్రం చేసింది. శ్రీవిష్ణు హీరోగా నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

ఆతర్వాత వరుసగా తెలుగులో నటించింది. సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన చిత్రలహరి సినిమాలో సెకండ్ హీరోయిన్ గా చేసింది. బ్రోచేవారెవరురా, అల వైకుంఠపురములో, బ్లడీ మేరీ, విరాట పర్వం ,దాస్ కా ధమ్కీ నటించింది.

విశ్వక్ సేన్ హీరోగా నటించిన దాస్ కా ధమ్కీ సినిమాలో నటనతో పాటు తన అందంతో ఆకట్టుకుంది ఈ బ్యూటీ. ఇక రీసెంట్ గా పరువు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ చిన్నది. ఓటీటీలో రిలీజ్ అయిన ఈ సినిమా పర్లేదు అనిపించుకుంది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో నివేదా పేతురాజ్ మాట్లాడుతూ.. ఆస్కతికర వ్యాఖ్యలు చేసింది. ఈ రోజుల్లో అందరూ లవ్ చేయడం లేదా డేటింగ్ చేస్తున్నారు. చాలా మంది సింగిల్ గా ఉండటానికి భయపడుతున్నారు అని తెలిపింది. అలాగే అమ్మాయిలు డేటింగ్ చేసే ముందు ఆ అబ్బాయి గురించి బాగా తెలుసుకోవాలి. ముందు ఫ్రెండ్షిప్ చేసి ఆ తర్వాత డేటింగ్ చేయాలి అని చెప్పుకొచ్చింది.




