- Telugu News Photo Gallery Cinema photos Raveena Tandon Daughter Rasha Thadani Shares Prayagraj Maha Kumbh Mela Photos
Maha Kumbh Mela: మహా కుంభమేళా ఫొటోలు షేర్ చేసిన ట్రెండింగ్ హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా? తల్లి కూడా స్టార్ నటినే
ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక వేడుకగా గుర్తింపు పొందిన ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళా ముగిసింది. జనవరి 13న ప్రారంభమైన ఈ కార్యక్రమం ఫిబ్రవరి 26 వరకు అట్టహాసంగా జరిగింది. సుమారు 60 కోట్లకు పైగా భక్తులు మహా కుంభమేళాలో పుణ్య స్నానాలు ఆచరించారు.
Updated on: Feb 28, 2025 | 7:34 PM

ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ వేదికగా జరిగిన మహా కుంభమేళాలో కోట్లాది మంది భక్తులు పాల్గొన్నారు. ఇందులో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు కూడా ఉన్నారు.

ముఖ్యంగా సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు పెద్ద ఎత్తున మహా కుంభమేళాను దర్శించుకున్నారు. పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించారు.

ఈ క్రమంలోనే బాలీవుడ్ క్రేజీ అండ్ ట్రెండింగ్ హీరోయిన్ రషా తడాని తన మహా కుంభమేళా యాత్రకు సంబంధించిన ఫొటోలను షేర్ చేసింది.

ఈ రషా తడానీ మరెవరో కాదు ఒకప్పటి స్టార్ హీరోయిన్ రవీనా టాండన్ ముద్దుల కూతురు. తల్లి బాటలోనే నడుస్తోన్న ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే బాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

ఇక ఈ మధ్యన డ్యాన్స్ వీడియోలతో సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది రషా తడాని. ఆమెకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతన్నాయి.

ఇటీవలే తల్లీ కూతుళ్లిద్దరూ కలిసి మహా కుంభమేళాకు వెళ్లొచ్చారు. తాజాగా తమ ఆధ్యాత్మిక యాత్రకు సంబంధించిన ఫొటోలను నెట్టింట షేర్ చేసింది రషా తడానీ.




