Mahakumbh Mela 2025: మహా కుంభమేళకు వెళ్లలేకపోయారా..? మీ కోసమే ఈ ‘డిజిటల్ బాత్’.. అదేంటంటే..
సంక్రాంతి పండగ సందర్భంగా జనవరి 13వ తేదీన ప్రారంభం అయిన ఈ మహా కుంభమేళా 2025.. మహా శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 26వ తేదీతో ముగిసింది. మొత్తంగా 45 రోజుల్లో 66 కోట్లకు పైగా భక్తులు మహా కుంభమేళాకు వచ్చినట్లు ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది. అయితే, ఈ కుంభమేళకు సంబంధించి అనేక వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓ వైరల్ వీడియో నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

Mahakumbh Mela 2025: 144 సంవత్సరాలకు ఒకసారి జరిగే మహా అద్భుత ఘట్టం.. 45 రోజుల పాటు ఘనంగా జరిగిన మహా కుంభమేళా ముగిసింది. ప్రయాగ్‌రాజ్‌లోని గంగా, యమునా, సరస్వతి నదుల త్రివేణి సంగమం వద్ద కోట్లాది మంది భక్తులు పుణ్య స్నానాలు చేసుకున్నారు. సంక్రాంతి పండగ సందర్భంగా జనవరి 13వ తేదీన ప్రారంభం అయిన ఈ మహా కుంభమేళా 2025.. మహా శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 26వ తేదీతో ముగిసింది. మొత్తంగా 45 రోజుల్లో 66 కోట్లకు పైగా భక్తులు మహా కుంభమేళాకు వచ్చినట్లు ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది. అయితే, ఈ కుంభమేళకు సంబంధించి అనేక వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓ వైరల్ వీడియో నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
మహాకుంభమేళాలో పవిత్ర స్నానం చేయలేని వారు తమ ఫోటోను వాట్సాప్ ద్వారా పంపితే అవతల వారు దానిని ప్రింట్ చేసి ఆ ఫోటోను నీటిలో ముంచుతారు. ఇది ఒక రకమైన డిజిటల్ బాత్. దీనికి రుసుము రూ. 1,100. అందుకు సంబంధించి సంఘటనా స్థలం నుండి ఫుటేజీని ఇంటర్‌నెట్‌లో షేర్ చేశారు. ఈ విషయాన్ని జాతీయ మీడియా సంస్థలు కూడా నివేదించాయి. స్థానికంగా నివసించే ఒక వ్యక్తి ఈ వ్యాపారాన్ని ప్రారంభించి సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేశాడు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఒక వ్యక్తి తన చేతుల్లో ఫోటోలు పట్టుకుని ఉండటం మనం చూడొచ్చు.
View this post on Instagram
సోషల్ మీడియాలో వీడియో వైరల్‌గా మారడంతో నెటిజన్లు పెద్ద సంఖ్యలో స్పందించారు. ఈ ‘డిజిటల్ బాత్’ కు అనుకూలంగానూ, వ్యతిరేకంగానూ చాలా మంది తమ అభిప్రాయాలను తెలియజేశారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…