చివరి అమృత్‌స్నాన్.. ప్రయాగ్‌రాజ్‌కు కోటి మందికి పైగా.. వీడియో!
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ లో జరుగుతున్న ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం మహాకుంభమేళాచివరి దశకు చేరింది. ఫిబ్రవరి 26తో ఈ మహాకుంభమేళా ముగియనుంది. పెద్ద సంఖ్యలో భక్తులు ప్రయాగ్‌రాజ్‌కు తరలివెళ్తున్నారు. చివరి అమృత్ స్నాన్ కోసం కోటి మందికిపైగా భక్తులు వస్తారని యోగి ప్రభుత్వం అంచనా వేస్తోంది. అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తోంది. ప్రయాగ్‌రాజ్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించింది. కుంభమేళా ప్రాంతాన్ని ‘నో వెహికల్ జోన్’ గా మారుస్తున్నారు అధికారులు. ఆంక్షలు అమల్లో ఉంటాయని ప్రకటించారు.
అత్యవసర, నిత్యావసర సర్వీసులకు చెందిన వాహనాలను మాత్రమే అనుమతించనున్నారు. యాత్రికులంతా ఈ మార్గదర్శకాలను పాటించాలని, అధికారులకు సహకరించాలని ప్రభుత్వం కోరింది. చివరి రోజు అమృత స్నానాల కోసం కోటి మందికిపైగా భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. కుంభమేళా ప్రాంతంలో రద్దీని నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా లక్నో వైపు నుంచి వచ్చే యాత్రికుల కోసం ఫాఫామౌ ఘాట్‌ను, మీర్జాపూర్ వైపు నుంచి వచ్చే వారికోసం ఆరైల్ ఘాట్‌ను రిజర్వ్ చేశారు. కౌశాంబి నుంచి వచ్చే భక్తుల కోసం సంగం ఘాట్‌ను కేటాయించారు. మరోవైపు ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లే అన్ని ప్రధాన రహదారుల్లో పోలీసులు భారీగా మోహరించారు. వాహనాలు సాఫీగా ముందుకు సాగేందుకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే.. 40 పోలీసు బృందాలు మోటార్‌బైక్‌లపై ఆ మార్గాల్లో మోహరించారు. ప్రయాగ్‌రాజ్‌ను కలిపే ఏడు ప్రధాన రహదారుల్లో అదనపు డైరెక్టర్ జనరల్, ఇన్‌స్పెక్టర్ జనరల్ స్థాయి అధికారులు విధుల్లో ఉండనున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
బర్డ్ ఫ్లూ భయం.. అయినా ఫ్రీ చికెన్ కోసం ఎగబడిన జనం వీడియో
డెస్క్‌కు చీమిడి రుద్దిన ఎలాన్ మస్క్ కొడుకు.. అది చూసిన ట్రంప్ ఏం చేశాడంటే! వీడియో
ఆ ఫోటోను చూస్తే కోతులకు ఎందుకంత భయం? వీడియో
నాటు నాటు పాటకు అఖిల్ స్టెప్పులు.. చివరిలో సూపర్ ట్విస్ట్..వీడియో

ఎండ వేడి తట్టుకోలేక ఏసీ ఆన్ చేస్తున్నారా.. అయితే జర జాగ్రత్త

మంచినీళ్లు అడిగి.. బంగారం దోచుకెళ్లాడు వీడియో

పిచ్చి పీక్స్‌కి.. వీడియో చూస్తే వణుకొస్తుంది

ఒక్క టూత్ బ్రష్‌తో దుమ్ము దులిపేసిందిగా..వీడియో

పెంపుడు కుక్కలను కిడ్నాప్ చేసి.. రూ.10 కోట్లు డిమాండ్ .. చివరికి

ఏసీ కోచ్‌ల్ ప్రయాణిస్తున్న వ్యక్తి.. పడుకుందామని రెడీ అవుతుండగా..

వారానికి 90 గంటల పని.. రోడ్డెక్కిన టెకీలు

ఈ చిన్నారుల ట్యాలెంట్‌కి ఎవరైనా అదరహో అనాల్సిందే

పెంపుడు కుక్కలను కిడ్నాప్ చేసి.. రూ.10 కోట్లు డిమాండ్ .. చివరికి

వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఇలా చేయండి..వీడియో

ఏసీ కోచ్‌ల్ ప్రయాణిస్తున్న వ్యక్తి.. పడుకుందామని రెడీ అవుతుండగా..

మా కళ్ల ముందే ఇద్దరిని కాల్చి చంపారు..ఐడీ కార్డులు చెక్ చేసి..వీ
